రంగారెడ్డి

పగిలిన భగీరథ పైపులైన్ .. కృష్ణాజలాలు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, ఆగస్టు 18: మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో కృష్ణానది జలాలు వృథాగా పోతున్నాయి. ఆదివారం కేశంపేట మండలం ఇప్పలపల్లి గ్రామ సమీపంలోని ఐరన్ పరిశ్రమ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో కృష్ణానది జలాలు వృథాగా పోతున్నాయ. పైపులైన్ పగిలిపోయి కృష్ణానది జలాలు పంటపొలాలతోపాటు చెరువులకు, కుంటలకు వెళ్తున్నాయి. భగీరథ నీటిని నిలిపివేసి పగిలిన పైపులైన్ నిర్మాణం పనులు త్వరగా చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉదయం నుంచి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు అంటున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో వౌంటెన్ తరహాలో నీళ్లు చిమ్ముతుండటంతో రోడ్డుపై వచ్చిపోయో వాహనదారులు అక్కడే నిలబడి చూస్తున్నారు.
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు నీరులేక ఎడారులను తలపిస్తుండటం..తాగునీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం భగీరథ పైపులైన్ పగిలి నీళ్లు వృథాగా పోతుంటే పట్టించుకునే వారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కేశంపేట మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అనేకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పటికైనా భగీరథ అధికారులు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకొని పైపులైన్ నిర్మాణం పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.