రంగారెడ్డి

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఆగస్టు 19: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దుందిగల్ వైద్య అధికారి డాక్టర్ నిర్మల అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీ నగర్ కమిటీ హాల్‌లో ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక వార్డు సభ్యుడు అబ్దుల్ ఖాదర్ ప్రారంభించి చికిత్స చేయించుకున్న వారికి మందులను అందజేశారు. వైద్యాధికారి నిర్మల మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, జ్వరాలు రాకుండా జాగ్రత్తలను తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిభిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాఘవులు, వాయిజార్, నారాయణ, బాలరాజ్, అనిత, అల్లావుద్దీన్, జగన్, కుర్షీద్, దత్తు పాల్గొన్నారు.
పేదల సమస్యల పరిష్కారమే లక్ష్యం
* ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి
ఘట్‌కేసర్, ఆగస్టు 19: పేద ప్రజల సమస్యల పరిష్కారమే కర్తవ్యంగా పని చేసినప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుందని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మెరుగు నరేష్‌గౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఎంపీపీ వైయస్‌ఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
మెరుగు నరేష్ గౌడ్‌ను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి తినిపించారు. ఉన్నతమైన లక్ష్యంతో అత్యున్నమైన పదవులను అధిరోహిస్తు ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందుతూ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నట్లు ఎంపీపీ వైయస్‌ఆర్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నోముల నవీన్‌ప్రకాష్, సహకార సంఘం మాజీ చైర్మన్ సార శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు బూడిద కృష్ణ, నాయకులు భానుగౌడ్, నర్సింహ్మ, పల్లె విజయ్, మెరుగు సురేష్, మల్లేష్ పాల్గొన్నారు.