రంగారెడ్డి

చెరువులోకి నీరు వచ్చేలా కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, ఆగస్టు 19: హయత్‌నగర్ డివిజన్ కుమ్మరికుంటలోకి వర్షపు నీరు వచ్చేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మార్నింగ్‌వాక్‌లో భాగంగా సోమవారం కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డితో కలిసి కాలనీల్లో పర్యటించారు. చెరువులోకి వచ్చే వర్షపు నీటికి ఎస్‌డబ్యూడి పైప్‌లైన్ లేకపోవడం వలన వర్షపు నీరు డ్రైనేజీలోకి వెళ్తుందని కార్పొరేటర్ వివరించారు. డీర్‌పార్క్ కల్వర్టు నుంచి హైకోర్టు కాలనీ మీదుగా జగదాంబ కాలనీ వరకు పైప్‌లైన్ వేయడం జరిగిందని జగదాంబ కాలనీ వద్ద రోడ్డు విడిచిన దాన్ని గుండా పైప్‌లైన్ వేయకుండా పట్టదారు అడ్డుపడడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. త్వరలో చెరువులోకి వర్షపు నీరు వచ్చేలా పైప్‌లైన్ వేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అందుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏఈని ఆదేశించారు. కార్యక్రమంలో చెన్నగోని శ్రీ్ధర్, మల్లేష్,శ్రీను, ఎల్లయ్య, శ్రీనివాస్‌గుప్త, చరణ్, కన్న నాయక్, కాలనీవాసులు పాల్గొన్నారు.

విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్
తలకొండపల్లి, ఆగస్టు 19: భూమి మీద పుట్టిన తర్వాత ప్రతి పిల్లవాడు చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధిస్తే,పుట్టి పెరిగిన గ్రామానికి కన్న తల్లి దండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అపుడే మన జన్మ ధన్యం అవుతుందని, దేశ భవిష్యత్ కాపాడిన వారు అవుతారని తలకొండపల్లి జడ్పీటీసీ వెంకటేష్ అన్నారు. మండలంలోని చుక్కాపూర్ ప్రాధమిక పాఠశాలలోని ప్రభుత్వం నుంచి మంజూరైన దుస్తులను పంపిణీ చేయడానికి ముఖ్య అథిధులుగా ఉప్పల వెంకటేష్ హాజరయ్యారు. పాఠశాలలోని సుమారు 81 మంది విద్యార్థిని విద్యార్థులకు ఏక రూప దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాములు,ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రామనాధం, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ కిష్టమ్మ, ఉప సర్పంచ్ జక్కు శ్రీనివాస్‌రెడ్డి,తలకొండపల్లి సర్పంచ్ లలితజ్యోతయ్య, ఉప సర్పంచ్ పద్మఅనిల్, మాజీ ఎంపీటీసీ యాదయ్య, నాయకులు రంగారెడ్డి,మాధార్‌గౌడ్,పాపయ్య,బుచ్చిబాబు పాల్గొన్నారు.
ప్రజావాణిలో 10 దరఖాస్తులు
కొడంగల్, ఆగస్టు 19: ప్రతి సోమవారం ప్రజాసమస్యల కోరకు తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే సోమవారం కొడంగల్ తహశీల్దార్ కిరణ్‌కుమార్‌తో పాటు ఆయా శాఖల అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి దరణి -8, కళ్యాణలక్ష్మి-1, పౌరసరఫరాలు-1 మొత్తం 10 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీటిని త్వరితగతిన పరిష్కారించేందుకు కృషి చేస్తామని తెలిపారు.