రంగారెడ్డి

ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, ఆగస్టు 19: మీర్‌పెట్‌హెచ్‌బికాలనీ డివిజన్ రాజీవ్‌నగర్‌లో బస్ బే నిర్మాణానికి స్థలం పరిశీలించాలని హెచ్‌ఆర్‌డీ అధికారులను ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆదేశించారు. మీర్‌పెట్‌హెచ్‌బికాలనీ డివిజన్ రాజీవ్‌నగర్ చౌరస్తా సమీపంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నయని ట్రాఫిక్ సిగ్నల్‌ను ఏర్పాటు చేయలని అధికారులకు సూచించారు. ప్రధాన రహదారిపైన ఉన్న నాలాను విస్తరించి రోడ్డు వెడల్పు చేయలని హెచ్‌ఆర్‌డీ అధికారులనకు ఆదేశించారు.
ఫలహార బండి ఊరేగింపు
ఉప్పల్, ఆగస్టు 19: కాచవానిసింగారం గ్రామంలో బోనాల జాతరలో భాగంగా సోమవారం నిర్వహించిన ఫలహార బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. యువజన సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహార బండి పూజలో తెలంగాణ ప్రభుత్వం సలహాదారులు వేణుగోపాల చారి, ఎమ్మెల్యే శ్రీ్ధర్ బాబు, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ మట్ట విష్ణుగౌడ్, వైస్‌ఎంపీపీ కర్రె జంగమ్మ, ఎంపీటీసీ వెంకట్ రాంరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు కర్రె జంగయ్య, రమేశ్, పెద్దలు మోటకట్ల భద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలకు పండుగ చేస్తే పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్‌కు తరలిన టీఆర్‌ఎస్ నేతలు
ఉప్పల్, ఆగస్టు 19: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలతో నాగార్జున సాగర్‌కు తరలివెళ్లారు. ప్రాజెక్టులు నిండి జలకళను స్వయంగా తిలకించడానికి టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దర్గ దయాకర్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసిన టూర్‌ను సోమవారం టీఆర్‌ఎస్ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఘట్‌కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. 20 బస్సులు, 25 కార్లలో సుమారు వెయ్యి మంది పార్టీ శ్రేణులతో వెళ్లారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు కుర్ర శివ కుమార్ గౌడ్, పప్పుల అంజిరెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డి, చెరుకు పెంటయ్య గౌడ్, చెరుకు మహేష్ గౌడ్, రాజ రాజు, బొడిగె కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.

ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
కీసర, ఆగస్టు 19: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు అధికారులు పరిష్కరించాలని డీఆర్వో మధుకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మేడ్చల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 56 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. కీసర ప్రధాన చౌరస్తాలో ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల భవనాలు నిర్మాణాలు జరుపుకుంటున్నాయని గ్రామస్తుడు రమేశ్ ఫిర్యాదు చేసారు. కీసర సహకార సొసైటీ గోదాముకు స్ధలం కేటాయించాలని పీఏసీ చైర్మన్ కే.కృష్ణారెడ్డి డీఆర్వో మధుకర్ రెడ్డికి వినతి పత్రం అందజేసారు.