రంగారెడ్డి

విద్యార్థినులకు రక్షణ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, ఆగస్టు 19: ఓయూ ఇంజనీరింగ్ హాస్టల్‌లో విద్యార్థినిలకు రక్షణ కల్పించాలని కోరుతూ పరిపాలన భవనం ఎదుట ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విలేఖర్లతో మాట్లాడుతూ ఓయూ ఇంజనీరింగ్ లేడీస్ హాస్టల్ ఆమ్మాయిలపైన దాడులు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్త చేశారు. హాస్టల్‌లో కనీసం సీసీ కెమేరాలు ఏర్పాటు చేయకుండా ఓయూ అధికారులు అమ్మాయిల భద్రతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులు కిత్రం లేడీస్ హాస్టల్‌లోకి చొరబడి ఆగంతకుడిని పట్టుకోకుండా అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు శంకర్, దుబ్బ రంజిత్, రాజేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలంలో
అక్రమ నిర్మాణాలు
ఉప్పల్, ఆగస్టు 19: మేడిపల్లిలోని సర్వే నెంబర్ 103లోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. తక్షణమే నిర్మాణాలను ఆపి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని జేఏసీ ప్రతినిధులు మహేందర్, తూళ్ల భిక్షపతి గౌడ్, నర్సింహ, జైపాల్‌రెడ్డి, నాగయ్య గౌడ్, రామయ్య, ఎల్లమయ్య, ఉమాశంకర్, వెంకటేశ్ గౌడ్, ప్రణయ్ కుమార్ వారు కోరారు. అనంతరం ఆర్డీఓ లచ్చిరెడ్డి, ఎమ్మార్వో అహల్యకు సైతం వినతి పత్రం అందజేశారు. అక్రమ నిర్మాణాలపై స్పందించకపోతే ఆందోళన చేపట్టగలమని హెచ్చరించారు.

బంజారాల సంబురం
ఉప్పల్, ఆగస్టు 19: బోడుప్పల్ బాలాజీహిల్స్‌లో సోమవారం బంజారాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే తీజ్ ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఆట పాటల మధ్య నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో జానపద కళాకారులు భూక్యా భిక్షునాయక్, రామావత్ చంద్రకాంత్, ధర్మనాయక్, జైరామ్ నాయక్, భీమా నాయక్, కమలాభాయి, లలిత భాయ్ పాల్గొని వచ్చిన అతిథులను గిరిజన సంప్రదాయంలో సన్మానించారు.