రంగారెడ్డి

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాదర్‌ఘాట్, ఆగస్టు 21: శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామని అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోని జలపాల దృశ్యాల వీక్షణకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామని పేర్కొన్నారు. సాధారణ బస్సు చార్జీకి అదనంగా యాబై శాతంతో చార్జీలు వసూలు చేస్తామని వెల్లడించారు. ఉదయం 3.45 గంటలకు ఎంజీబీఎస్ నుంచి మొదటి బస్సు ప్రారంభమవుతుందని, ప్రతి అరగంటకు ఒకటి ఉంటుందని చెప్పారు. సాయంత్రం 5.45 చివరి బస్సు ఉంటుందని తెలిపారు.