రంగారెడ్డి

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 22: మేడ్చల్ మునిసిపల్ కిష్టాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో నేడు (శుక్రవారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పట్టణ విద్యుత్ ఏఈ విజయ్‌కుమార్ తెలిపారు. 11 కేవీ ఐడీఏ హనుమాన్, టైమ్‌టెక్నో, గోసాయిగూడ గ్రామానికి వ్యవసాయ విద్యుత్ సరఫరా, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాయం ఉంటుందని ఏఈ వివరించారు. వినియోగదారులు అసౌకర్యాన్ని మన్నించి సిబ్బందితొ సహకరించాలని కోరారు.
మున్సిపల్ కమిషనర్ వాణీరెడ్డి బదిలీని ఆపాలి
ఉప్పల్, ఆగస్టు 22: పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ అల్లూరి వాణీ రెడ్డి ఆకస్మిక బదిలీని నిలిపివేయాలని కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శిలు, రాజకీయ పార్టీల నాయకులు మంత్రి మల్లారెడ్డిని కోరుతూ గురువారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ఇటీవలనే బాధ్యతలు తీసుకున్న వాణీ రెడ్డి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారు. కాలనీల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తున్న కమిషనర్‌ను బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పీర్జాదిగూడ అభివృద్ధిలో నెంబర్ వన్ కార్పొరేషన్ కావాలంటే వాణీరెడ్డి ఎంతో అవసరమని పలువురు కోరారు. ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి నాయకత్వంలో శ్రీపాద కాలనీ మహిళలు రజని, దేవి, జ్యోతి, లక్ష్మీ, సరిత, సువర్ణ, అమర్నాధ్, రాంగోపాల్ రావు, శంకర్, యాదగిరి, రాంరెడ్డి, జనార్ధన్, రాకేష్ పాల్గొని మంత్రికి వినతి పత్రం అందజేశారు.
రింగ్ రోడ్డులో సూచిక బోర్డులు
ఉప్పల్, ఆగస్టు 22: ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసే సూచిక బోర్డులను ట్రాఫిక్ పోలీసులు గురువారం ఉప్పల్ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేశారు. హెల్మెట్, సీట్‌బెల్ట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవ్, డ్రంకన్ డ్రైవ్, సిగ్నల్ జంప్, ట్రిఫుల్ రైడ్, డేంజరైస్ డ్రైవ్ చేస్తే ఎంత జరిమానా విధిస్తారన్న పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాధ్ తెలిపారు. బోర్డులను డీసీపీ మనోహర్, ఏసీపీ శ్రీనివాస రావు ప్రారంభించగా కొత్త మోటారు వేహికిల్ చట్టంపై ప్రజలకు వివరించారు.
సమస్యలపై నిరంతరం పోరాటం
ఉప్పల్, ఆగస్టు 22: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని కాలనీలలో దీర్ఘకాలిక సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని మాజీ జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో అధ్యక్షుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన టీఆర్‌ఎస్ నేతలు
ఉప్పల్, ఆగస్టు 22: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్‌ఎస్ బోడుప్పల్ నాయకులు రాసాల వెంకటేశ్ యాదవ్, పులకండ్ల జంగారెడ్డి, లోకేష్ కలిశారు. పట్టణంలో మంత్రి మల్లారెడ్డి సహకారంతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆఫీసు ప్రారంభం
ఉప్పల్, ఆగస్టు 22: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉప్పల్ కార్యాలయాన్ని గురువారం స్థానిక ప్రధాన రహదారిలో సమితి సెంట్రల్ కమిటీ సభ్యులు నాయని బుచ్చిరెడ్డి ప్రారంభించారు. ఉత్సవ సమితి కన్వీనర్ బొరంపేట మురళీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఆర్.రాజు, బీజేపీ సీనియర్ నాయకులు గొరిగె కృష్ణ, శామీర్‌పేట ధర్మారెడ్డి, మంకాల లక్ష్మణ్, రావుల బాలకృష్ణ, బలవంతచారి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.