రంగారెడ్డి

అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, ఆగస్టు 22: వైవిధ్యంగా అలంకరించిన బోనం పాత్రలను నెత్తిన పెట్టుకొని పట్టుచీరలతో బారులు తీరిన మహిళలు.. హోరెత్తించిన డప్పమోతలకు అనుగుణంగా లయబద్దంగా నృత్యాలు చేస్తూ విన్యాసాలు సాగించిన పోతరాజులు కేరింతలు.. భక్తులతో జనసముద్రాన్ని తలపించేలా మారిన మహేశ్వరంలో రెండవ రోజు గురువారం బంధుమిత్రులతో కలసి పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఆధ్యాత్మికతతో పోచమ్మ ఆలయానికి కొత్తకళ వచ్చింది. మేళాల చప్పళ్లకు తోడు హుషారు తెప్పించే పాటలతో పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద జాతర కొనసాగింది. సర్పంచ్ కర్రోళ్ల ప్రియాంకరాజేష్, ఉప సర్పంచ్ దోమ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు పీ.సుదర్శన్ యాదవ్, వీ.అనురాధ, కే.సునీతతోపాటు టీఆర్‌ఎస్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్, కూన యాదయ్య, ఎం.నవీన్, ఎస్.ఆనందం, బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు యాదవ్, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, పాపయ్య గౌడ్, శ్రావణ్, కాంగ్రెస్ నాయకులు కాకి ఈశ్వర్, మొలగాసి సత్యనారయణ, అల్లె కుమార్, అల్లె భిక్షపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మహేశ్వరం సీఐ వెంకన్న నాయక్ పర్యవేక్షణలో ఎస్సైలు శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, నాగార్జున బందోబస్తు నిర్వహించారు.