రంగారెడ్డి

అభివృద్ధిని మరచిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 13: టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అభివృద్ధిని గాలికి వదిలేసిందని అత్తాపూర్ డివిజన్ తెదేపా అధ్యక్షులు మిద్దెల సురేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం అత్తాపూర్ డివిజన్ పరిధిలోని భరత్‌నగర్ కాలనీలో తెదేపా ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిద్దెల సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీ ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్క పార్టీల నాయకులను పార్టీలోకి తెచ్చుకోవడానికి చేసిన కృషి అభివృద్ధిలో మాత్రం మరిచారన్నారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు.
ఎన్నికలకు ముందు గుర్తురాని హామీలు గ్రేటర్‌లో గెలవాలనే లక్ష్యంతో ఇష్టం వచ్చినట్లు హామీలను గుప్పిస్తూ ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎలాగైనా గ్రేటర్‌లో జెండా ఎగురవేయాలని టీ ఆర్ ఎస్ చేయని కుట్రలు లేవన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీల నుంచి వలసలు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఏ బస్తీకి వెళ్లినా ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నారని, సమస్యలను పట్టించుకోకుండా తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య విద్యుత్ తదితర సమస్యలతో నరకయాతన పడుతున్నారని వారిని పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అధికారుల చుట్టు ఎన్నిసార్లు తిరిగినా సమస్యలను పట్టించుకోకపోగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం అధికారులపై అజమాయిషీ లేకపోవడంవల్ల అధికారులు విధులకు రాకుండా తమ సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బస్తీల్లో పర్యటించిన వారిలో తెదేపా నాయకులు మిద్దెల సురేష్‌రెడ్డి, ఉపేందర్, శంకర్, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా ఎస్పీని అభినందించిన ప్రముఖులు

వికారాబాద్, డిసెంబర్ 13: సైబరాబాద్ పోలీసులు మహిళల భద్రతే లక్ష్యంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం షీ టీమ్స్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలను మాదాపూర్‌లోని ఎన్ కనె్వన్షన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి మహిళల భద్రత పట్ల కృషిని ప్రశంసించారు. సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, సినీనటి జయసుధలు సైతం ఆమెను అభినందించారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి మల్కాజ్‌గిరి డిసిసిగా బాధ్యతలు నిర్వహించినపుడు సైబరాబాద్ షీ టీమ్స్ పర్యవేక్షణాధికారి ఇన్‌చార్జిగా పనిచేస్తూ ఆకతాయిలు, ఈవ్‌టీజర్ల ఆగడాలను షీ టీమ్స్ ద్వారా చెక్ పెడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగినులు, విద్యార్థినులకు తగినంత భద్రత కల్పించారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయ స్ర్తిలు, బాలికలపై జరుగు హింస తొలగింపు దినోత్సవం సందర్భంగా 16 రోజుల పాటు జిల్లా పోలీసులచే మహిళలపై జరుగు హింసానేరాలకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఎస్పీ మహిళల భద్రత పట్ల చేస్తున్న కృషిని అభినందించారు.

సమాజంలో రాణించాలంటే అన్ని కులాలతో కలసిమెలసి ఉండాలి

వికారాబాద్, డిసెంబర్ 13: అన్ని కులాలతో కలిసిమెలసి ఉంటే సమాజంలో రాణించడం ఖాయమని వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ గుప్త అన్నారు. ఆదివారం అనంతగిరి శ్రీఅనంతపద్మనాభస్వామి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీవాసవి నీలగిరి ఆర్యవైశ్య సంఘం ప్రథమ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ధైర్యంగా ఉండి ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని పిలుపునిచ్చారు. అన్ని కుల, మతాలతో కలిసి ఉన్నందుకే ఎనిమిదిసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యామని, మొన్నటి ఎన్నికల్లో గిరిజన తండానుంచి విజయం సాధించి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యామని చెప్పారు. సేవ చేసే దృక్పథం కలిగి ఉండాలని, సేవచేస్తే ముందడుగు వేయడం ఖాయమని అన్నారు. మానసేవయే మాధవసేవ అని, ఆర్యవైశ్య సంఘానికి ఏ అవసరం వచ్చినా తప్పక సహకరిస్తామని తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు చాలామంచివారని, పట్టణ అభివృద్ధికి సహకరిస్తారని పేర్కొన్నారు. తన గెలుపు కోసం ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య వికారాబాద్‌కు వచ్చేవారని గుర్తుచేశారు. జీవితంగా రాజకీయం చాలా ముఖ్యమైనదని స్పష్టం చేశారు. ఆర్యవైశ్యుల ఉన్నత విద్య కోసం రోశయ్య సహకారం తీసుకుంటామని అన్నారు. శ్రీవాసవి నీలగిరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జిన్నం వెంకటేశ్వర్లు గుప్త మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని రెండుప్రాంతాలకు చెందిన వారం 30 ఏళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డామని, ప్రారంభంలో 21 కుటుంబాలతో సంఘాన్ని ఏర్పాటు చేసుకోగా, ప్రస్తుతం 50 కుటుంబాలు సభ్యత్వం కలిగి ఉన్నాయని తెలిపారు. సంఘంలోని కుటుంబాలు కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటాయని, వారానికోసారి సమావేశాలు ఏర్పాటు చేసకుంటాయని వివరించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్యా ఫెడరేషన్ ఏపి, తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల, శ్రీవాసవి నీలగిరి ఆర్యవైశ్య సంఘం ప్రధానకార్యదర్శి వెంకటయ్య, కోశాధికారి శ్రీనివాసులు, కార్యనిర్వాహకులు లక్ష్మణమూర్తి, సభ్యులు కాసం వెంకటయ్య, కాసం కిషన్, వికారాబాద్ ప్రముఖులు రాజయ్య. జిన్నం అంజయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణను జాపిక, శాలువాతో సన్మానించారు.

రంగారెడ్డి ఆశయ సాధనకు కృషి
చేవెళ్ల, డిసెంబర్ 13: మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. కొండా వెంకట రంగారెడ్డి 125వ జయంతి సందర్భంగా చేవెళ్లలోని ఆయన విగ్రహానికి ఆయన మనవడు, ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య కుటుంబసభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. నాయకులు కేక్ కట్‌చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా వెంకట రంగారెడ్డి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి అయన ఆశయాలు నెరవేర్చాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన అనేకసార్లు పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి దిశగానే సిఎం కేసిఆర్ పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని పేర్కొన్నారు. సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా ఇంక నీరు, విద్యుత్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రెండు సంవత్సరాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు సిఎం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపిపి బాల్‌రాజ్, టిఅర్‌ఎస్ నాయకులు చందు, నాగార్జునరెడ్డి, మాణిక్యరెడ్డి, నర్సింలు, రాఘవేందర్‌రెడ్డి పాల్గొరు.

గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు గల్లంతు
రాజేంద్రనగర్, డిసెంబర్ 13: దేశం చూపు తెలంగాణ వైపు తిప్పుకునేలా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం గ్రేటర్ టీ ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తోకల శ్రీశైలంరెడ్డి ఆధ్వర్యంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ గగన్‌పహాడ్‌కు చెందిన 200 మంది తెదేపా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా ప్రగతికాలనీ నుంచి మంత్రి మహేందర్‌రెడ్డి నివాసానికి తరలివెళ్లారు. అనంతరం మహేందర్‌రెడ్డి సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ నేతలు టీ ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకొని ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ విజన్ చూసి ఆకర్షితులై అన్ని పార్టీల నుంచి టీ ఆర్ ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారే తప్ప ప్రలోభాలు చేయడం లేదని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని బిస్తరు చుట్టుకోవాల్సిందే అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా వికసించి మేయర్ పీఠంపై టీ ఆర్ ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని, నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేసి ప్రతిపక్షాలకు తగిన బుద్ది చెప్పాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ గ్రేటర్‌లో ఒక్క సీటు కూడా గెలువదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలన్ని ఏకమైనా టీ ఆర్ ఎస్‌ను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నాయని అది సాధ్యం కాదన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్, ఇప్పటికే ఖాళీ అయిపోయిందని, మిగిలిన కొంత మంది నాయకులు ఉన్నారని వారు కూడా టీ ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తరలివెళ్లిన వారిలో రాజేంద్రనగర్ సర్కిల్ జాగృతి కన్వీనర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి శీలం తిరుపతిరెడ్డి, కృష్ణయాదవ్, బాల్‌రాజ్‌గౌడ్, రాజు, శ్రీశైలం తదితరులు ఉన్నారు.
హస్తకళా ప్రదర్శనకు ముస్తాబైన శిల్పారామం
గచ్చిబౌలి, డిసెంబర్ 13: హస్త కళాకారులకు డిసెంబర్ 15 అంటే పండుగరోజు. ఎందుకంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి హస్తకళాకారులందరూ ఒకేచోటచేరి తమ ఉత్పత్తులను ప్రదర్శించుకుంటారు.
ఈ నెల 15నుండి 31 వరకు జరిగే జాతీయ హస్తకళా మేళను రాష్ట్ర గవర్నర్ సిఎస్‌ఎల్ నరసింహన్ ప్రారంభించనున్నట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి జి.కిషన్‌రావు తెలిపారు. దేశంలోని వివిద రాష్ట్రాలనుండి 520 మంది హహ్తకళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని శిల్పారామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రావు తెలిపారు. ఈ ప్రదర్శనలో 150 హ్యాండ్‌లూమ్ స్టాల్స్, 50 జూట్ స్టాల్స్, 100 హ్యాండి క్రాప్ట్సు స్టాల్స్, ఉడ్ కార్పింగ్, హ్యాండ్ బ్లాక్ పెయింటింగ్ ఇంకా అనేక రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో చేనేత చేతి వృత్తులకు సంబంధించి 18 మంది జాతీయ స్థాయిలో అవార్డులు పొందినవారుకూడా ఉన్నారు. గ్రామీణ సాంప్రదాయ కళలను, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో శిల్పారామం పనిచేస్తుందన్నారు.
సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సందర్శకుల వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలనుకూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శిల్పారామం ప్రధాన ద్వారంవద్ద సందర్శకుల వస్తువులను భద్రపరచుకునే సౌకర్యం కల్పించామన్నారు.
10 టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 16 రోజులపాటు నిర్వహించే ఈ హస్తకళా మేళాకు వేలాదిమంది హాజరుకానున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హ్యాండ్‌లూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళికృష్ణ, శిల్పారామం సుందరీకరణ సలహాదారు రాజేందర్‌రెడ్డితోపాటు అధికారులు పాల్గొన్నారు.