రంగారెడ్డి

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, సెప్టెంబర్ 15: రామంతాపూర్ గణేష్‌నగర్‌లోని శివాజీ యూత్ అసోసియేషన్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గణేష్ నవరాత్రోత్సవాలు ముగింపుకార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ సిల్వర్ జుబ్లీ వేడుకలను నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు తిండేరు హన్మంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జీ.రాఘవ రెడ్డి, కార్యదర్శి రఘు ప్రసాద్, జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అనంత లక్ష్మీ, ఉత్సవ సమితి కార్యదర్శి శశిధర్, జోనల్ ఇంచార్జి బుచ్చి రెడ్డి, నిర్వహకులు మాలకొండా రెడ్డి, పాండయ్య, రామేశ్వర్, వెంకటాద్రి 300 మంది మండప నిర్వాహకులు పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు గణేష్ నవరాత్రి వేడుకలను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసినందుకు అభినందనలు తెలుపుతూ పలువురిని సన్మానించి జ్ఞాపికలనుఅ అందజేశారు. ప్రముఖులైన ఇనుకొండా నర్సింహా రెడ్డి, ఆనందజ్యోతి విద్యాసంస్థల అధినేద ప్రసాద్, స్వరూప, ఉత్తమ మండపం కింద ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కొత్తపల్లి రమేశ్, సీహెచ్ హరీష్, బాల్‌రాజ్, సీహెచ్.శ్రీనివాస్, సోమ శ్రీనివాస్, శ్రీకాంత్, కులకర్ణి, కరుణాకర్, జగదీష్ పాల్గొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సమాజ సేవే లక్ష్యంగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్న మాజీ కౌన్సిలర్ తిండేరు హన్మంత రావును పలువురు ప్రముఖులు సన్మానించి ప్రశంసల జల్లు కురిపించారు.