రంగారెడ్డి

పడకేసిన పల్లెసీమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 15: పల్లెసీమల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో డెంగ్యూ, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వంటి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల కారణంగా ప్రజల్లో ఎక్కువ శాతం డెంగ్యూ, వైరల్ ఫీవర్ కేసులు పెరిగిపోవడంతో వ్యాధిగ్రస్తుల్లో ప్లేట్‌లెట్స్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దాంతో వ్యాధిగ్రస్థుల కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. రోగాల బారినపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీలతోపాటు గిరిజన తండాల్లో సీజనల్ వ్యాధులు ఒక్కసారిగా విజృంభిస్తుండటంతో ప్రజలు తట్టుకోలేక అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు వ్యాధుల పేరుతో ప్రజలను నిలువుగా దోచుకుంటున్నారు. ఏ వ్యక్తి పలకరించినా..ఏ గ్రామానికి.. ఏ గిరిజన తండాకు వెళ్లినా డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయ. గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఇంటిని తట్టినా సీజనల్ వ్యాధిగ్రస్తులే ఒకరో ఇద్దరో దర్శనమిస్తున్నాని తెలుస్తోంది. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, దోమలు, ఈగలు పెరిగిపోవడం వంటి పరిస్థితుల నేపధ్యంలోనే వ్యాధుల సంఖ్య పెరిగిపోతున్నాయి. మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులు, ఆర్‌ఎంపీ వైద్యుల వద్దకు రోగులు చేరుకొని వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందుతున్నారు. ఇలాంటి సీజనల్ వ్యాధులు నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాయని.. తిరిగి ప్రస్తుతం మాత్రమే వచ్చాయని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అంటున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం.. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగానే వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే నామమాత్రంగా చికిత్సలు చేసి పంపిస్తున్నారే తప్పా పూర్తి స్థాయిలో వైద్యపరీక్షలు చేయడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి సీజనల్ వ్యాధులకు గురైన రోగులకు మెరుగైన చికిత్సలు చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వైరల్ ఫీవర్ బాధితులే ఎక్కువ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిత్యం వైరల్ ఫీవర్, టైఫాయిడ్ జ్వరాలతో రోగులు ఎక్కువగానే వస్తున్నారని కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దామోదర్ వివరించారు. వారం రోజుల క్రితం డెంగీ వ్యాధికి సంబంధించి సుమారు 10మంది వరకు రోగులు వచ్చారని, వారిని వైద్య పరీక్షల నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. స్థానిక ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధికి సంబంధించి పరీక్షలు చేసే యంత్రాలు లేవని, దాంతో అక్కడికి పంపించినట్లు తెలిపారు. ఎక్కువ శాతం వైరల్ ఫీవర్, టైఫాయిడ్ వ్యాధిగ్రస్థులే ఎక్కువగా వస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రికి రోగుల సంఖ్య క్రమంగా పెరిగిందని తెలిపారు.