రంగారెడ్డి

ధర్మవిరుద్ధంగా పనిచేసే పార్టీలకు పుట్టగతులుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, సెప్టెంబర్ 15: హిందూ ధర్మానికి, సమాజానికి వ్యతిరేకంగా పని చేసే రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవని తెలంగాణలో బొందుగాళ్లకు స్థానంలేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆదివారం మహేశ్వరం మండలం డబిల్‌గూడ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి హోమం, గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ భవిష్యత్తులో కాషాయ జండాలకు తప్ప రంగు రంగుల జండాలకు స్థానం లేదని 80శాతం ఉన్న హిందువులు సంఘటనా శక్తిగా మారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తారని పేర్కొన్నారు. దేశంకోసం, ధర్మం కోసం పనిచేస్తున్న కార్యకర్తలే కాబోయే పాలకులని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కనుమరుగయ్యాయని ఎర్రజెండా రంగు నెరిసిపోయి కాషాయ రంగుగా మారుతుందని సీపీఎం, సీపీఐ పార్టీల నుద్దేశించి అన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ బాక్సులు బద్దలు కావడం ఖాయమని అన్నారు. ధర్మానికి ఎవరు అడ్డువచ్చినా ఉపేక్షించేది లేదని ధర్మరక్షణ కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధం కావాలని సంఘపరివార్ కార్యకర్తలకు, బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నర్సింహా రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు, బుగ్గని శంకర్, టీ.యాదీష్ పాల్గొన్నారు.