రంగారెడ్డి

అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షునిగా ప్రవీణ్ యాదవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, సెప్టెంబర్ 15: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షునిగా ప్రవీణ్ యాదవ్ నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా మహాసభ అధ్యక్షుడు రాంచందర్ యాదవ్ ఆదివారం నియామకపత్రాన్ని అందజేశారు. హైదర్షాకోట్ శ్రీ లక్ష్మినర్సింహ స్వామి కల్యాణ మండపంలో మహాసభ సమావేశాన్ని నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్ మాట్లాడుతూ కుల సోదరులందరిని ఏకం చేసి సంఘం సభ్యులుగా చేరుస్తానన్నారు. ప్రతి సభ్యుడిని కలిసి సంఘాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కుమార్ యాదవ్ పాల్గొన్నారు.