రంగారెడ్డి

ఆర్టీసీని విలీనం చేసే వరకు సమ్మెను కొనసాగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, అక్టోబర్ 14: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు వెనక్కి తగ్గేదిలేదని ఆర్టీసి జేఏసీ నాయకుడు, బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుండ్ల అంజనేయులు గౌడ్ హెచ్చరించారు. ఆర్టీసీ సంస్థను విలీనం చేయటం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ రెడ్డికి మృతి సంతాపంగా ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మండల బీజేపీ, ఆర్టీసీ జేఏసీ నాయకులు కొవ్వత్తులతో భారి ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం ఆవరణలో మానవహారం నిర్వహించి, ధర్నా జరిపారు. మండల బీజేపీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు శ్రీరాములు, ఎదుగని శ్రీరాములు, ఆర్టీసీ జేఏసీ నాయకులు అశోక్ పాల్గొన్నారు.
పెంచిన జీతాలను వెంటనే అందజేయాలి
ఉప్పల్, అక్టోబర్ 14: పెంచిన జీతాలను వెంటనే అందజేయాలని డిమాం డ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు సోమవారం కీసరలోని మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమ్మె చేస్తున్న సమయంలో రూ.8500 వేతనం అందజేస్తామని సీఎం హామీ ఇచ్చి ఇంత వరకు అమలు చేయడంలేదని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 14 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వీబీ బోసు, నాయకులు సబిత, ఈశ్వర్, స్వామి, శ్రీనివాస్, జయచంద్ర పేర్కొన్నారు.
భగీరథ నీళ్లు అందించడమే లక్ష్యం
షాద్‌నగర్ రూరల్, అక్టోబర్ 14: కృష్ణా జలాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనులు చేస్తున్నట్లు షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో 730 మీటర్ల ఇంట్రా పైపులైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు అందించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్, సింగిల్ విండో చైర్మన్ చించోడు అనంతం, మున్సిపల్ మాజీ చైర్మన్ అగ్గనూరి విశ్వం, నేతలు నరేందర్, మనె్న నారాయణ, చీపిరి రవి యాదవ్, బచ్చలి నర్సింహా పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలి
* జ్యూట్ బ్యాగుల పంపిణీలో ఎంపీపీ ఇందిర పిలుపు
ఉప్పల్, అక్టోబర్ 14: ప్రాణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించాలని కీసర ఎంపీపీ ఇందిర పిలుపునిచ్చారు. సోమవారం కీసర మండలం పరిధిలోని బోగారం గ్రామంలో ఎంపీడీఓ శశిరేఖ, సర్పంచ్ కవితతో కలిసి జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీకి రూ.4.50లక్షలతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి ఇచ్చిన డీ.నర్సింహా రెడ్డికి కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ జానకి రాం, ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గౌతమి పాల్గొన్నారు.