రంగారెడ్డి

మండల సర్వసభ్య సమావేశంలో వాగ్వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, అక్టోబర్ 14: ఏదులాబాద్ గ్రామంలోని పార్కు స్థలాలు సర్పంచ్ కాళేరు సురేష్ నిర్లక్ష్యంతో కబ్జాలకు గురి అవుతున్నాయని ఆ గ్రామ ఎంపీటీసీ గట్టగళ్ల రవి సభలో ఆరోపించటంతో ఇరువురి మధ్య వాగ్వివాదంతో సభలో గందరగోళం జరిగింది. ఘట్‌కేసర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. మండల పరిధిలో ఏదులాబాద్ గ్రామంలోని పలు లే ఔట్లలోని పార్కు స్థలాలను కొంత మంది రియల్ వ్యాపారులు స్థానిక సర్పంచ్ కాళేరు సురేష్ సహకారంతో కబ్జాలు చేసి అమ్ముకుంటున్నట్లు సభలో ఆరోపించటంతో సర్పంచ్ సురేష్ స్పందించి తనకు ఇప్పటి వరకు ఏలాంటి సమాచారం లేదని, పార్కు స్థలాలు కబ్జాలకు గురి అవుతుంటే నాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని సభలో ప్రశ్నించటంతో ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కల్పించుకుని వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శి ప్రదీప్‌ను ఆదేశించారు. జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రా రెడ్డి మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేశారని, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలను భాగస్వాములను చేసి అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించిన ఏఈ చంద్రవౌళి అభినందనీయుడని తెలిపారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, ఎంపీడీఓ అరుణ, తహశీల్ధార్ పద్మప్రియ, సభ్యులు కొమ్మిడి శైలజ, గట్టగళ్ల రవి, కందుల సరళ, వినోద, సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్, కాళేరు సురేష్, కొమ్మిడి జలజారెడ్డి, చిలుగూరి మంగమ్మ పాల్గొన్నారు.

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి
నార్సింగి, అక్టోబర్ 14: అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రామ్‌దాస్, యువజన విభాగం నాయకుడు సాగర్ గౌడ్ సూచించారు. బండ్లగూడ పెట్రోల్ బంక్ నుంచి కిస్మత్‌పూర్ వరకు వేయనున్న బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని బండ్లగూడ జాగీరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును కలిసి విన్నవించారు. నాయకులు, అధికారులు కలిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. పర్యటనలో గోపాల్ ముదిరాజ్, హరికృష్ణ, ప్రేమ్‌గౌడ్, సుందర్ గౌడ్ ఉన్నారు.