రంగారెడ్డి

మేడ్చల్-మల్కాజిగిరి, కంబైండ్ ఎలెవన్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: స్కూల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సమాఖ్య (ఎస్‌ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న భరాత్ రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ సబ్ జూనియర్ స్టేట్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, కంబైండ్ జిల్లా ఎలెవన్ జట్లు విజయం సాధించాయి. అండర్-14 లీగ్ చాంపియన్‌షిప్ ప్రారంభ మ్యాచ్‌లో పోటీలకు అతిథ్యమిస్తున్న హైదరాబాద్ జిల్లా జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో మేడ్చల్-మల్కాజిగిరి జట్టు విజయం సాధించాయి. నగరంలో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్ మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జట్టు బౌలర్లు కే.శేశాంక్, ప్రమోద్ కుమార్ చేరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన మేడ్చల్-మల్కాజిగిరి జట్టు 14.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన జానీరేయూల్ 55, భరత్ కుమార్ 38 పరుగులతో అజేయంగా నిలిచారు. మరో మ్యాచ్‌లో కంబైండ్ ఎలెవన్ జట్టు 12 పరుగుల తేడాతో ప్రత్యర్థి మేడ్చల్-మల్కాజిగిరిపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన మేడ్చల్-మల్కాజిగిరి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి ఓటమిపాలైంది. కంబైండ్ ఎలెవన్ జట్టు బౌలర్ ధార్మిక్ తొమ్మిది పరుగులిచ్చి నాలుగు, రామ్‌గుప్తా ఎనిమిది పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు.