రంగారెడ్డి

కొందుర్గు పీఎస్‌ను సందర్శించిన కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, అక్టోబర్ 16: కొందుర్గు పోలీస్ స్టేషన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సందర్శించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు పోలీస్ స్టేషన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తోపాటు డీసీపీ ప్రకాష్ రెడ్డి, క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఐటీసెల్ సీఐ రవీంద్రప్రసాద్‌లు సందర్శించి పరిశీలించారు. జాతీయ స్థాయి అవార్డుకు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా చొప్పదండి, మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ, రంగారెడ్డి జిల్లా కొందుర్గు పోలీస్ స్టేషన్లు ఎంపికైనట్లు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. అందులో భాగంగానే ఈ పోలీస్ స్టేషన్‌ను సందర్శించినట్లు పేర్కొన్నారు. క్రైమ్ సిబ్బంది వివరాలతోపాటు రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలనే విషయాలను ఎస్‌ఐ శ్రీనివాస్‌కు సూచించారు. సీసీ కెమెరాలను ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రాత్రి సమయాల్లో విధిగా పెట్రోలింగ్ నిర్వహించడమే కాకుండా అనుమానం వచ్చిన వక్తులను అదుపులోకి తీసుకొని విచారించాలని సూచించారు. స్థానికంగా పరిశ్రమలు ఉన్నాయని, పకడ్బంధీగా పెట్రోలింగ్ నిర్వహించేందుకు కృషి చేయాలని ఎస్‌ఐకి సూచించారు. షాద్‌నగర్ ఏసీపీ సురేందర్, రూరల్ సీఐ రామకృష్ణతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.