రంగారెడ్డి

చైల్డ్ కేర్‌కు పాప తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, అక్టోబర్ 17: నాలుగు నెలల పాపను రోడ్డు సమీపంలోని చెట్ల పొదల్లో వదిలివెళ్లిన సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బడంగ్‌పేట్ కూరగాయల గోడౌన్‌కు ఎదురుగా మాతృశ్రీ ఎన్‌క్లెవ్ సమీపంలోని రోడ్డుకు పక్కన చెట్ల పొదలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినారు. అటుగా వెళ్తున్న శ్రీనివాస్ రెడ్డి చూసి 100 నెంబర్‌కు సమాచారం అందించాడు. పోలీసులు చేరుకొని పాపను బషీర్‌బాగ్‌లోని చైల్డ్ కేర్ సెంటర్‌కు అప్పగించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆందోళనలు
ఉప్పల్, అక్టోబర్ 17: సమస్యల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఉప్పల్, చెంగిచర్ల బస్‌డిపోల వద్ద వంటా..వార్పు నిరసనలు, ధూంధాం కార్యక్రమాలు హోరెత్తించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి మద్ధతుగా బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ప్రతినిధులు సంఘీభావం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా పోలీసు బందోబస్తు మధ్య ఉప్పల్ బస్‌డిపో బస్సులు బయటకు రావడంతో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు.

ఏకాగ్రతతో విధులు నిర్వర్తించాలి
* ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్
ఘట్‌కేసర్ అక్టోబర్ 17: ఏకాగ్రతతో విధులు నిర్వర్తించి ప్రమాదాలు జరుగకుండా ప్రతి డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలని కుషాయికూడ ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్ తెలిపారు. పోచారం మున్సిపాలిటీ పరిధి ఇన్ఫోసిస్ కంపెనీలో కుషాయిగూడ ట్రాఫి క్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కంపెనికి చెందిన క్యాబ్‌లు, బస్సుల డ్రైవర్లకు ట్రాఫిక్ ఆఫరేషన్ ప్రోగ్రామ్ నిర్వహించి ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. పోలీసుల అమర వీరులను స్మరిస్తు వౌనం పాటించారు. రోడ్లపై వాహనాలను నడిపేటప్పుడు మనస్సును, దృష్టిని మరల్చకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ట్రేయినింగ్ ఇన్‌స్పెక్టర్లు ప్రదీఫ్, జోసెఫ్, ట్రాఫిక్ అడిషనల్ ఇన్‌స్పెక్టర్ స్వామి, కంపెనీ ప్రతినిధులు దాస్ గుణాలన్, వెంకటేశ్, ఎస్‌ఐలు ప్రభాకర్ రెడ్డి, భిక్షపతి, సోమనాథ్ పాల్గొన్నారు.