రంగారెడ్డి

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఇబ్బందులకు త్వరలో పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 17: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌తో వచ్చే ఇబ్బందులను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. గురువారం జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను ప్రత్యేకాధికారి సుజాత గుప్త, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డితో కలిసి సందర్శించారు. డంపింగ్ యార్డ్ సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసికెళ్లగా రూ.26కోట్ల నిధులు మంజూరు చేశారని, మినరల్ డెవలప్‌మెంట్ నిధుల నుంచి జిల్లా కలెక్టర్ రూ.2కోట్లు మంజూరు చేశారని అన్నారు. చెత్త డంపింగ్ యార్డ్ దుర్వాసన రాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో హెర్బల్ పార్కు, మూడు పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
పెట్రోల్ బంకులలో వసతులను కల్పించాలి
కీసరలో గురువారం గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ బంక్‌ల డీలర్లతో మంత్రి చామకూర మల్లారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. కనీస వసతులను కల్పించి ప్రజలకు అందుబాటులో నీటి సౌకర్యం కల్పించి మరుగుదొడ్లను తెరిచి ఉంచాలని ఆదేశించారు. బంక్‌లలో పని చేసే సిబ్బందికి యూనిఫామ్ ఇవ్వాలని, వచ్చే వినియోగదారులకు తినుబండారాలను విక్రయించాలని, ఉత్తమ బంక్‌లకు అవార్డులను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. హరితహారంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.
కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనంతో తీర్చిదిద్దబడ్డాయని అన్నారు. పెట్రోల్ బంక్‌లలోకి వచ్చే వినియోగదారులకు ఎలాంటి సందేహాలు కలుగకుండా భరోసా ఇవ్వాలని అన్నారు. శుభ్రత పాటించి సేఫ్టీ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని, అత్యవసర ఫోన్ నెంబర్ల వివరాలను డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్, గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, ఆయిల్ ఇండస్ట్రీస్ డీజీఎం నాయక్, డీఎస్‌ఓ రమేశ్ పాల్గొన్నారు.