రంగారెడ్డి

వౌలిక సదుపాయాల కల్పనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, అక్టోబర్ 19: మహేశ్వరం మండల కేంద్రంలో వౌలికసదుపాయాల కల్పనకు కృషి చేస్తామని మహేశ్వరం గ్రామ సర్పంచ్ కర్రోళ్ల ప్రియాంకరాజేష్ అన్నారు. శనివారం 3వ వార్డులో మాజీ రాజ్యసభ సభ్యుడు టీ.దేవేందర్‌గౌడ్ రూ. ఆరు లక్షల నిధులతో వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించారు. మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు జరుగకుండా తాగునీరు, సీపీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పైపులైన్లు, విధి దీపాలు వంటి పనులను చేస్తానని అన్నారు. మంత్రి సబితారెడ్డి, జిల్లా చైర్‌పర్సన్ అనితారెడ్డి నిధులు మంజూరు చేయించి త్వర్వలో మహేశ్వరం బస్‌స్టాండ్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేస్తామని గ్రామ ప్రజలకు హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్, ఉప సర్పంచ్ దోమ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఎస్.ఆనందం, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకుడు కర్రోళ లచంద్రయ్య ముదిరాజ్, కో ఆప్షన్ సభ్యుడు రమేష్, గోల్కోండ మైసయ్య, కటికెల మమాత మైసయ్య, వార్డు సభ్యులు, రాఘవేందర్, ఏ.శ్రీకాంత్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం
*డా. నరేందర్ రెడ్డి
అల్వాల్, ఆక్టోబర్ 19: ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా కమ్ముకున్న జ్వరాలు అన్ని డెంగ్యూ, మలేరియా కాదని డా. నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా జంటనగరాల్లో విషజ్వరాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, జ్వరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రతలు వివరించారు. జ్వరాలు వచ్చిన వారికి అవగాహన లోపంతోనే ఆందోళన చెందుతున్నారని ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాతవరణంలో వచ్చిన మార్పుల వల్ల రెండు నెలలుగా జ్వరాలు వస్తున్నాయని ప్రతి జ్వరం డెంగ్యూ, స్వైన్‌ప్లూ, మలేరియా కాదనీ ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా డెంగ్యూ జ్వరంగా నిర్దారణ కాలేదని సీజనల్ వ్యాధులే అధికంగా ఉన్నాయనీ వివరించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అవగాహనతో మందులు వాడితే ఎంతటి రోగమైనా తగ్గుతుందని స్పష్టం చేశారు.