రంగారెడ్డి

అక్రమ అరెస్టులతో భయపడేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, అక్టోబర్ 19: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. శనివారం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా రవాణాలో పనిచేస్తున్న 50వేల కుటుంబాల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చలగాటం ఆడటం సరైన పద్ధతి కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకలజనుల సమ్మెను ఎలా నిర్వహించామో అదే తరహాలో ఆర్టీసి జేఏసీ ఆధ్వర్యంలో బంద్‌ను విజయవంతం చేసినట్లు వివరించారు. నీళ్లు, నిధులు, నియామాకాలని చెప్పిన సీఎం కేసీఆర్ నేడు వాటిని విస్మరించాలని ఆరోపించారు. శాంతియుతంగా సమ్మె చేస్తుంటే పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయించడం సరైన పద్దతి కాదని, నియంతలా పరిపాలన చేయడం తగదని అన్నారు. సీపీఎం నేత ఎన్.రాజు మాట్లాడుతూ ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఇప్పటి వరకు ఆర్టీసి జేఏసీతో ఎందుకు చర్చలు నిర్వహించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లతో 50శాతం డిమాండ్లను ఎలాంటి చర్చలు లేకుండానే పరిష్కరించ వచ్చని, వాటిని సైతం పరిష్కరించకుండా నాన్చుడు దోరణి అవలంభించడంలో అంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ నేత శ్రీనునాయక్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
కార్మికులను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందే తప్ప సమస్యల సాధన కోసం కృషి చేయడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ మొండివైఖరి విడనాడి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంక్షేమ సంఘం నేత పినపాక ప్రభాకర్, టీజేఏసీ నాయకురాలు అనురాధ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్, టీవీవీ, ఎస్‌ఎఫ్‌ఐ, బీజేవైఎం, ఏఐఎస్‌ఎఫ్, ఎబీవీపీ, యుటీఎఫ్, ఫౌర హక్కుల సంఘం, బీజేఎంఎం సంఘాల నేతలు పాల్గొన్నారు.
యాచారంలో అఖిలపక్షం రాస్తారోకో
యాచారం: ఆర్టీసీ కార్మికుల జేఏసీ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు అఖిల పక్ష పార్టీల నాయకులు కార్మికులతో కలిసి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. బంద్‌లో భాగంగా యాచారం మండల కేంద్రంతో పాటు మాల్ ప్రధాన కూడలిలో దుకాణ సముదాయాలను ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష పార్టీల నాయకులు మూసివేయించారు. పెట్రోల్ బంక్‌లను మూసివేయించి, ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. దీంతో జనజీవనం స్తంభించింది. ఆందోళన చేపడుతున్న అఖిలపక్ష పార్టీల నాయకులు యాచారం పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి నాయకులు నిరసన తెలిపారు.
పరిగి: పరిగిలో బంద్ ప్రశాంతంగా జరిగింది. శనివారం ఉదయం ఆర్టీసి కార్మీకులకు మద్దతుగా బంద్‌లో పాల్గోనడానికి వచ్చిన వామ పక్షా నాయకులను పోలీస్‌లు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి పరిగి బస్ డిపోలొనుంచి ఒక్క బస్‌కూడ బయటికి రాలేదు.
కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఏం , ఏఐఏస్‌ఏఫ్, నాయకులు కోడంగల్ చౌరస్తానుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలి నిర్వహించారు. కిరాణషాపులు తెరిచిఉన్నాయి. బస్ స్టాండ్‌లోలోకి బస్‌లు రాకుండ కంచెను వేశారు. ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ డిఏస్పీ రవింద్రరెడ్డి, సీఐ మొగులయ్య, ఎస్‌ఐలు సీబ్బంది బందోబస్తు నిర్వహించారు.