రంగారెడ్డి

పరిగి డిపో బస్సులను అడ్డుకున్న కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్: షాద్‌నగర్ ఆర్టీసీ డిపోకు వచ్చిన పరిగి డిపో బస్సులను స్థానిక ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల తరువాత పరిగి డిపోకు చెందిన మూడు ఆర్టీసీ బస్సులు షాద్‌నగర్ డిపోకు వచ్చాయి. అక్కడే ఉన్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఒక్కసారిగా ఆ బస్సుల వద్దకు చేరుకొని తాత్కాలిక డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా సమ్మె చేస్తుంటే మీరు బస్సులు ఎలా నడిపిస్తారంటూ మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న టౌన్ సీఐ శ్రీ్ధర్‌కుమార్ తమ సిబ్బందితో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకున్నారు. అప్పటికే బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దించడమే కాకుండా తాత్కాలిక డ్రైవర్లపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. బంద్‌కు ఒకరోజు ముందుగానే తాత్కాలిక డ్రైవర్లకు, కండక్టర్లకు సహకరించాలని కోరామని, మా మాటలు ఏమి పట్టించుకోకుండా ఇలా బస్సులను నడిపించడం ఏమిటని వాపోయారు. ఈ ఘటనతో షాద్‌నగర్ బస్టాండ్ ఆవరణలో పోలీసులు బందోబస్తును మరింత పటిష్టం చేశారు.
రాజేంద్రనగర్: తమ డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి.బంద్‌కు ఆర్టీసీ ఐకాసతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు ప్రకటించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంలో రాజేంద్రనగర్ ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన రాష్ట్ర బంద్ సంపూర్ణమైనట్లు ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఐకాస నేతలు ప్రకటించారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో వ్యాపార వాణిజ్య విద్యాసంస్థలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. రాజేంద్రనగర్ నిర్మానుష్యంగా రోడ్లు మారాయి. ఆర్టీసీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. అరెస్ట్ చేసే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని కోరారు. సమ్మె కొనసాగింపుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఐకాస నేతలు వెల్లడించారు. తెలంగాణ బంద్ సంపూర్ణమైనట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని కార్మిక సంఘాలు చెప్పారు. బంద్‌కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. అక్రమ అరెస్ట్‌లను నేతలు ఖండించారు. భౌతికదాడులు చేయడం సరికాదని హితువు పలికారు. నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై భవిష్యత్ కార్యాచరణను సాయంత్రం ప్రకటిస్తామని కార్మిక సంఘాలు వెల్లడించాయి.
అరెస్ట్‌ల పర్వం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ, వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలు చౌరస్తాలతో ఆర్టీసీ డిపో వద్ద ధర్నా, ఆందోళన చేపట్టారు. రాష్ట్ర బీజేపీ నాయకులు బుక్క గోపాల్, వై.శ్రీ్ధర్, మల్లారెడ్డి, కొమరయ్య, వేలాది మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు షాబాద్, శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్ తదితర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఇది నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పోరు అని, ఆర్టీసీ కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
పోలీసుల పర్యవేక్షణలో
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాజేంద్రనగర్ నియోజకవర్గవ్యాప్తంగా బంద్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగింది. డిపో నుంచి బస్సులు బయటకు రాగానే ఆర్టీసీ కార్మిక నేతలు, కార్మికులు వాటిని అడ్డుకుంటున్నారు. ఆందోళన చేస్తున్న కార్మికులు, వివిధ రాజకీయ పార్టీలు సంఘాలు, నాయకులను పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్లకు తరలిస్తున్నారు. ఆసిఫాబాద్ డిపోల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపథ్యంలో రాజేంద్రనగర్ డిపో పరిధిలో 113 ఆర్టీసీ బస్సులు, 23 అద్దె బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్డు ఎక్కని బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ సందర్భంగా రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో సీపీఎం కాటేదాన్ ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై దుర్గానగర్, అరాంఘర్, డైరీఫాం మీదుగా రాజేంద్రనగర్ ఆర్టీసీ బస్‌డిపో వరకు కొనసాగి డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
కేపీహెచ్‌బీకాలనీ : ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ ఆర్టీసీ ఐకాస చేపట్టిన రాష్ట్ర బంద్‌లో భాగంగా కూకట్‌పల్లిలో పాక్షికంగా, ప్రశాంతంగా జరిగింది. బంద్‌కు మద్దతుగా రోడ్లపైకి, బస్సు డిపోల వద్ద విపక్ష నేతలు ఆందోళనలు చేపట్టారు. ఆర్‌టీసి కార్మికుల మద్దతుగా కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టు యూనియన్ తరుపున కూకట్‌పల్లి డిపో వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్ డిపో వద్ద ధర్నా చేసిన బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు, జనసేన కార్యకర్తలను, బీజేపి కార్యకర్తలను అరెస్టు చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వికారాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం బంద్ నిర్వహించారు. బంద్‌కు వ్యాపారస్థులు సైతం స్వచ్ఛంధంగా సహకరించి వారి దుకాణ సముదాయాలను సాయంత్రం వరకు తెరవలేదు. బంద్‌లో భాగంగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం మద్దతు ఇచ్చి బంద్‌లో పాల్గొన్నాయి. బస్‌డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు. పోలీసు బలగాలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన కారులను అరెస్టు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రత్నారెడ్డి, కిషన్‌నాయక్, బీజేపీ నాయకులు సదానంద్‌రెడ్డి, పోకల సతీష్, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు రాజేశ్వర్, అశోక్ ఉన్నారు.