రంగారెడ్డి

సీఎం దత్తత గ్రామాల అభివృద్ధిపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 19: సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధిపై దృష్టి సారించాలి. రోడ్డుకిరువైపుల మొక్కల సంరక్షణ, పరిశుభ్రతను పాటించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశం మందిర్‌లో శామీర్‌పేట్ మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శిలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రహదారిలో ఇరువైపుల మొక్కలను నాటి పరిరక్షించుకునే బాధ్యత పంచాయతీలదేనని పేర్కొన్నారు. మొక్కలకు పాదులు తీసి ఎరువులను వేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో అరకిలో మీటర్ వరకు ఒకరిని నియమించి మొక్కలను సంరక్షించాలన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో సువాసన గల చెట్లను నాటాలని, గ్రామ పొలిమెర్లలో సూచిక బోర్డులను వేయాలని పేర్కొన్నారు. అలియాబాద్ నుంచి లక్ష్మాపూర్ వెళ్లే రోడ్లలో పనులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. పనులను చేపట్టాలని, లేనిచో బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పారు. సమావేశంలో డీపీఓ రవి కుమార్, డీఆర్‌డీఓ కౌటిల్య, సీపీఓ సౌమ్య, ఎంపీడీఓ వాణి, సువిధ పాల్గొన్నారు.