రంగారెడ్డి

హరితహారం మొక్కను తిన్న మేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, అక్టోబర్ 21: హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కను మేక తినగా జరిమానా విధించిన సంఘటన మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం కొత్తపేట గ్రామంలో నిర్ధవెల్లి రవికి చెందిన మేక హరితహారం చెట్టును తింటున్న విషయాన్ని గ్రామానికి చెందిన భానుచందర్ అనే వ్యక్తి చూసి మేకను పట్టుకొని సర్పంచ్ నవీన్‌కుమార్‌కు అప్పగించారు. దాంతో మేక యజమాని రవికి తక్షణమే రూ.500 జరిమానా విధించారు. మేకను పట్టుకొని అప్పగించినందుకు భానుచందర్‌కు రూ.50 బహుమతిగా ఇచ్చారు. హరితహారంలో నాటిన మొక్కలను మేకలు తింటే వాటి యజమానులకు జరిమానా తప్పదనని, విషయాన్ని గమనించాలని కోరారు.