రంగారెడ్డి

భక్తులతో కిక్కిరిసిన సంగం మఠం రామాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, నవంబర్ 12: కార్తీక పౌర్ణమి పురస్కారించుకుని లంగర్‌హౌస్ సంగం ముచుకుంద నదిలో వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసి సంగం రామాలయంలో స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. మంగళవారం వేకువ జామున మూడు గంటల నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి వరకు నదిలో వేలాది మంది భక్తులు స్నానాలు ఆచారించారు. నగరంలో నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి హేమగంగా, గుప్తగంగ, ముచుకుందా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీసీతారామ లక్ష్మణులను, గణపతి, కన్నాయలాల్, అంజనేయ స్వామి, శివపార్వతులు, శ్రీవేంకటేశ్వర్ స్వామిని దర్శించుకున్నారు. మఠాధిపతి రాహుల్‌దాస్ బాబా ఆధ్వర్యంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షణ భారతదేశంలో మరెక్కడా లేనివిధంగా నగరంలో ప్రతిష్టాత్మకమైన ఈసీ, మూసీ, ముచుకుంద నదుల కలయికనే ‘త్రివేణి సంగం’గా పిలుస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు లంగర్‌హౌస్‌లో సంగం ప్రాంతంలో భక్తులతో కళకళలాడింది. నదిలో మూరికికంప ఉండటంతో భక్తులకు ఆటంకంగా కలుగకుండా మఠాధిపతి రాహుల్‌దాస్ బాబా ఆ ప్రాంతంలో పరిశుభ్రం చేయించారు. కార్తీక మాసం పౌర్ణమి రోజున ముచుకుంద నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తే చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయిని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ రామాలయానికి ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. చారిత్రత్మకమైన దేవాలయం కార్తీక పౌర్ణమి రోజే నిర్మించడంతో ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచిందని ఆశ్రమాధిపతి రాహుల్‌దాస్ బాబా తెలిపారు. గోల్కొండ కోటలోని జైలులో ఉన్న భక్తరామాదాసును విడిపించేందుకు శ్రీరామాలక్ష్మణులు ఇక్కడికి వచ్చి, త్రివేణి సంగంలో పుణ్య స్నానాలు ఆచరించడంతో నేటికి వేలాది మంది భక్తులు ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. నదిలోని పారుతున్న నీటిలో దీపాలను వెలిగించి వారివారి మొక్కులను మొక్కుకుని వదిలిపెట్టారు.
జాతర
కార్తీక మాసం పురస్కారించుకుని స్థానికంగా ప్రతి సంవత్సరం జాతరను నిర్వహిస్తారు. అధునిక యుగంలో నగరంలోని ఇంత పెద్ద జాతర కొనసాగడం ఎంతో ప్రాముఖ్యత అని చెప్పవచ్చు. వ్యాపారులు వివిధ వస్తువులు దుకాణాలను ఏర్పాటు చేశారు. చిన్నా పిల్లలు కొనుగోలు చేయడానికి బొమ్మలను ఇతర ఆట వస్తువులను ఆమ్మకానికి పెట్టారు. జాతరలో ఏర్పాటు చేసిన రంగుల రాట్నంతో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఆనందాన్ని ఆస్వాదించారు. కొందరు ఈ ప్రాంతంలో భక్తులు వనభోజనాలను నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకున్న
మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
కార్తీక పౌర్ణమి (డూప్కి పున్నమి) పురస్కారించుకుని స్వామివారిని మంగళవారం మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మఠాధిపతి రాహుల్‌దాస్ బాబా సన్మానించారు. లంగర్‌హౌస్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ నాయకుడు దేవర కరుణాకర్, కార్వాన్ బీజేపీ కన్వీనర్ ఆకుల గోవర్దన్ రావు, వినేష్ సింగ్, లింగారెడ్డి, గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళీ ఆలయ మాజీ చైర్మన్ కోయిల్‌కర్ గోవింద్‌రాజ్ పూజులు నిర్వహించారు.
ఊరేగింపు
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీసీతారామా లక్ష్మణులను మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున సంఘం నుంచి భాజాభజంత్రీలతో కోలాహలంగా స్వామివారిని ఊరేగింపును కొనసాగించారు.
ఆసీఫ్‌నగర్ ఏసీపీ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ భారీ బందోబస్తును నిర్వహించారు. సంగం వద్ద టోలిచౌకి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.