రంగారెడ్డి

ఆర్టీసీకి బీజేపీ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 12: న్యాయమైన డిమాండ్‌ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. రెండు నెలలుగా జీతాలు లేక కార్మిక కుటుంబాలు పస్తులుంటున్న నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ బోడుప్పల్ నగర పాలక సంస్థ అండగా నిలువడానికి ముందుకు వచ్చింది. మేమున్నామంటూ భరోసా ఇస్తూ 50 మంది కార్మికులకు నెలకు సరిపడే బియ్యం, పప్పు, నూనె, ఇతర నిత్యావసర వస్తువులను మంగళవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దాసరి మహేష్, నాయకులు ఏనుగు లక్ష్మయ్య, సిల్వేరు శంకర్, ఏర్పుల మహేష్, లీలావతి, రాధిక, విజయలక్ష్మి, సంధ్య, స్వప్న పాల్గొన్నారు.