రంగారెడ్డి

బుగ్గకు పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, నవంబర్ 12: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రారంభమయిన బుగ్గ జాతరకు భక్తులు పోటెత్తారు. నియోజకవర్గ పరిధిలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలోని బుగ్గరామలింగేశ్వరుని దేవాలయం కార్తీకశోభను సంతరించుకుంది. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి నుంచి పక్షం రోజుల పాటు జరిగే బుగ్గరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు తెల్లవారు ఝాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలోని గుండంలో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. బుగ్గ ఉత్సవాల ప్రారంభమైన తొలిరోజే సుమారు 20 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించి బుగ్గరామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయంలోని బుగ్గరామలింగేశ్వరునితో పాటు కబీర్‌దాస్ మందిరం, ఉమామహేశ్వరులు, శివలింగంతో పాటు పలు దేవాలయాలున్నాయి. కార్తీకమాస ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే దంపతులు
బుగ్గరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే, సతీమణి ముకుందమ్మ బుగ్గరామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన వారిలో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీలు జంగమ్మ, ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.