రంగారెడ్డి

సంస్కృతికి నిదర్శనం ‘వీధి నాటకాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, నవంబర్ 14: భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి నిదర్శనంగా వీధి నాటకాలు నిలుస్తున్నాయని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం షాద్‌నగర్ పట్టణంలోని శ్రీ్భరతి ప్యేపుల్స్ పాఠశాలలో పండిత్ జవహ్‌ర్‌లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. డీసీపీ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే పలు వీధి నాటకాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల చైర్మన్ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపాల్ కృష్ణవేణి, కరస్పాండెంట్ చంద్రహాస్ పాల్గొన్నారు.
సర్కారు బడుల్లో బాలల దినోత్సవం
జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. గురువారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రాలతోపాటు వివిధ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో భారత మాజీ ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
బాలల దినోత్సవం సందర్భంగా సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాలాల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ.శ్రీను నాయక్, పాఠశాల హెచ్‌ఎం అరుందతి, సత్యం, ఉప సర్పంచ్ రెడ్యా నాయక్, రాజు నాయక్, శంకర్ నాయక్, చిట్టి సావిత్రి పాల్గొన్నారు.