రంగారెడ్డి

నియమ నిష్టలతో అయ్యప్ప మాలధారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 16: అయ్యప్ప స్వామి మాలధారణ నియమ నిష్టలతో కూడిందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. సుభాష్‌నగర్ డివిజన్ అపురూపకాలనీలో అయ్యప్ప స్వామి పడి పూజ కన్నులపండువగా జరిగింది. ఈ పూజలకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ విచ్చేసి అయ్యప్ప స్వామి దర్శించుకుని పూజలు చేశారు. ఎంతో భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప స్వామి పూజలు చేయాలని అన్నారు. అయ్యప్ప స్వామి మాలధారణతో మానసిక ప్రశాంతతతో, మంచి జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో మోహన్, రమణ, మల్లేశ్ గౌడ్, లక్ష్మీనారాయణ, ప్రసాద్, రాజు, రవి, గణేశ్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్ గురుస్వామి పాల్గొన్నారు.
రోడ్డు పనులకు భూమిపూజ
కొత్తూరు, నవంబర్ 16: సీసీ రోడ్డు నిర్మాణం పనులకు స్థానిక సర్పంచ్ మామిళ్ల సంతోష విఠల్ భూమిపూజ చేశారు. శనివారం నందిగామ మండల పరిధిలోని చేగూర్ గ్రామంలో సర్పంచ్ సంతోష విఠల్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ నిధులు ఒక లక్ష రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నట్లు వివరించారు. చేగూర్ గ్రామ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీశైలం, శివ, నర్సింలు, జంగయ్య, సురేష్ గౌడ్, విజయ్, శంకర్ పాల్గొన్నారు.
అనుమతులు ఎలా ఇచ్చారు
షాద్‌నగర్ రూరల్, నవంబర్ 16: ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన నుంచి వేస్తున్న రోడ్డు నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారంటూ ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శి శివ, ప్రశాంత్ ప్రశ్నించారు. శనివారం ప్టణంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలంలో వేస్తున్న రోడ్డుకు ఎలాంటి అనుమతులు లేవని, సంబంధిత ప్రిన్సిపాల్ అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అజాం అన్నారు.
బస్తీ బాటతో సమస్యలు పరిష్కారం
మేడ్చల్, నవంబర్ 16: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు మండలంలోని గౌడవెల్లి సర్పంచ్ సురేందర్ గ్రామంలో బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం జంగాల బస్తీలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. పోచమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని, జంగాల బస్తీని కొయ్యబస్తీగా నామకరణం చేయనున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. బస్తీలో త్వరలో రోడ్లు వేస్తామని, మిగతా సమస్యలు కూడా దశల వారీగా పరిష్కరిస్తామని సర్పంచ్ వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యురాలు రాజమణి సుధాకర్ పాల్గొన్నారు.
కన్నుల పండువగా శివ లింగ ప్రతిష్ఠాపన
మేడ్చల్, నవంబర్ 16: మండలంలోని ఎల్లంపేట్ గ్రామంలో శివాలయం, గాజులమ్మ గుడిని దాత ఉమారెడ్డి వీరేంద్ర కుమార్ పునర్‌నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివ లింగాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమలో ఎంపీటీసీ కుమార్ యాదవ్, జగన్ గౌడ్, రామకృష్ణ, లక్ష్మీ నర్సింహ, వార్డు సభ్యులు రమేశ్ యాదవ్, రాజు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.