రంగారెడ్డి

కాలుష్య కోరల్లో అన్నరాయిని చెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, నవంబర్ 16: కాలుష్య కోరల్లో చిక్కుకున్న అన్నరాయిని చెరువును పరిరక్షించాలని చెరువుపరిరక్షణ సమితి సభ్యులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని కోరారు. శనివారం కమిటీ సభ్యులు మంత్రి నివాసానికి వెళ్లి సమస్యను వివరించారు. కాప్రా నుంచి వస్తున్న డ్రైనేజీ నీళ్లు అన్నరాయిని చెరువులో కలుస్తున్నాయని దీంతో నీరు కలుషితమైందని, దోమలు ప్రబలి పలు కాలనీల ప్రజలు రోగాల బారిన పడుతున్నాయని ఆవేద వ్యక్తం చేశారు. పై నుంచి వస్తున్న డ్రైనేజీ నీరు చెరువులో కలువకుండా ప్రత్యేక కాలువను ఏర్పాటు చేసి నీటిని బయటికి పంపాలని కోరారు. తిరిగి సాగునీరు, తాగునీటి చెరువుగా మార్చాలని విన్నవించారు. స్పందించిన మంత్రి వెంటనే నాగారం మున్సిపల్ కమిషనర్ వాణికి, మేడ్చల్ జిల్లా నీటి పారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ మాట్లాడారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, మిషన్ కాకతీయ కింద పను చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో చెరువుపరిరక్షణ సమితి సభ్యులు ప్రశాంత్, సుధాకర్ రెడ్డి, వెంకట్, శేఖర్, వీరేశం, కృష్ణమాచార్యులు, మల్లారెడ్డి, రఘుపతి, వివేక్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, నర్సింహులు పాల్గొన్నారు.