రంగారెడ్డి

అస్మత్‌పూర్‌లో.. భయం భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, నవంబర్ 16: మంచాల మండల పరిధిలోని అస్మత్‌పూర్ గ్రామంలో ఆవులపై చిరుత దాడి కలకలం రేపింది. గ్రామ శివార్లలోని వ్యవసాయ పొలం వద్ద మంతని శ్రీశైలం అనే రైతుకు చెందిన రెండు ఆవులపై శుక్రవారం అర్థరాత్రి చిరుతపులి దాడి చేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల పరిధిలోని పీసీ తండాలో ఇదే తరహాలో దాడి చేసిన చిరుత మళ్లీ పంజా విసరడంతో అస్మత్‌పూర్ గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలంటే జంకుతున్నారు. సంఘటనాస్థలాన్ని గ్రామ సర్పంచ్ ప్రవీణ్ పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

శ్రీరామలింగేశ్వర స్వామి కల్యాణం
కీసర, నవంబర్ 16: కార్తీక మాసం ఆర్ర్ధానక్షత్రంను పురస్కరించుకొని కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామికి వేద పండితులు కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నగర నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు. భక్తులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి, గుట్ట పరిసర ప్రాంతాల్లోని శివ లింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టీ.నారాయణ శర్మ, ఈవో సుధాకర్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
* బోడుప్పల్ కమిషనర్ శంకర్ హామీ
ఉప్పల్, నవంబర్ 16: సమస్యలు చెప్పండి..సత్వరమే పరిష్కరిస్తానని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శంకర్ అన్నారు. మన పట్టణం-మన ప్రణాళికలో భాగంగా శనివారం చెంగిచర్లలోని పలు కాలనీలలో పాదయాత్ర నిర్వహించారు. ద్వారకనగర్, క్రాంతి కాలనీ, వెంకట సాయినగర్, ప్రివిలేజ్, స్టాలిన్ రాధిక నగర్‌లో ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుటంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు బింగి జంగయ్య యాదవ్ పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాలను కూల్చేయాలి
జీడిమెట్ల, నవంబర్ 16: అక్రమ నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేయాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి డిమాండ్ చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీని కలిసిన బీజేపీ నేతలు అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత నిజాంపేట్ గ్రామంలోని పలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను బీజేపీ నేతలు పరిశీలించారు. నిజాంపేట్ గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలను చేపడుతున్నారని అన్నారు. గ్రామంలో చెరువులన్నీ కుచించుకుపోతున్నాయని, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని, అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. కనీసం అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాల పై టౌన్‌ప్లానింగ్ అధికారులైనా కఠిన చర్యలు తీసుకోవాలని వినతులు సమర్పించినా పట్టించుకోవడంలేదని అన్నారు. అధికారులు అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సింహా రెడ్డి, రాజు, సతీష్ పాల్గొన్నారు.