రంగారెడ్డి

గాలిలో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 19: జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కెమికల్ పరిశ్రమల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాల్లో కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని సీపీఐ నాయకుడు ఐలయ్య అన్నారు. జీడిమెట్లలోని జీవికే లైఫ్ సైనె్సస్ పరిశ్రమలో సోమవారం అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృతిచెందడాన్ని నిరసిస్తూ సీపీఐ నేతలు, ఏఐటీయూసీ నాయకులు షాపూర్‌నగర్ రైతుబజార్ నుంచి సాగర్ హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఐలయ్య మాట్లాడుతూ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తరుచూ రసాయన పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు సంభవించి కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. జీవికే లైఫ్ సైనె్సస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు కార్మికులకు రూ.25 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు ఏసురత్నం, స్వామి, మహేశ్, సుంకిరెడ్డి, సత్యనారాయణ, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.