రంగారెడ్డి

‘తాడే’ కార్మికుడి ప్రాణాలను కాపాడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 3: అసలే హైటెన్షన్ విద్యుత్ వైర్లు..తాకితే గాలిలో ప్రాణాలు.. గాలిలోనే.. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా పనులు చేస్తున్న కార్మికులు. అధికారుల నిర్లక్ష్యం..కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో ఆ కార్మికుడు పది నిమిషాల పాటు విద్యుత్ స్థంభంపైనే విలవిలలాడిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చోటు చేసుకుంది. ఆలస్యం చేస్తే నిండుప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడేవి.. తక్షణమే అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ సమయంలో నడుముకు బిగించుకున్న తాడే ఆ కార్మికుడి ప్రాణాలను కాపాడిన సంఘటన మంళవారం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో విద్యుత్ లైన్ మరమ్మతు పనులు కార్మికులు చేస్తున్నారు. అక్కడ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ అనే విద్యుత్ కార్మికుడు పని చేస్తున్నాడు. నడుముకు తాడు కట్టుకొని విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా అంతలోనే ఒక్కసారిగా కరంటు సరఫరా కావడంతో పదినిమిషాల పాటు విద్యుత్ స్థంభంపైనే ఆ కార్మికుడు గిలగిల కొట్టుకున్నాడు. చేతికి తీవ్రంగా గాయం కావడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. నడుముకు తాడు లేకపోతే కిందపడే వాడని, సంబంధిత కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడం వల్లే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు.