రంగారెడ్డి

అక్రమ వెంచర్లు చేస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, డిసెంబర్ 3: షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్, సోలిపేట్ శివారులోని 111జీవో పరిధిలో అక్రమ వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని కందుకూర్ డీ ఎల్‌పీవో శ్రీనివాస్, ఈవోపీఅర్‌డీ వసంతలక్ష్మి అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్, సోలిపేట్ శివారులోని అక్రమంగా వెలసిన వెంచర్లపై అధికారులు దాడి చేశారు. అనంతరం వెంచర్లలో బీటీ రోడ్లు, అండర్ డైనేజీ డివెండర్స్‌లను జేసీబీలతో తొలగించారు. డోజర్‌తో అంత చేదరకొట్టారు. అక్రమ వెంచర్లు చేయవద్దని ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చిన రియల్ వ్యాపారస్థులు పట్టించుకోకుండ ఇలా చేయడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేస్తున్న సమయంలో చుట్టు పక్కల గ్రామాల వారు వచ్చి కష్టపడి కూలీ పనులు చేస్తు వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ వెంచర్లను కూల్చి వేస్తున్నామని డీఎల్‌పీవో శ్రీనివాస్ చెప్పారు.