రంగారెడ్డి

కార్పొరేట్‌కు ధీటుగా ఫలితాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, డిసెంబర్ 4: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు ధీటుగా ఫలితాలు సాధించాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.
ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి, మంచాల జడ్పీటీసీ మర్రి నిత్యలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఉచితంగా స్టడీమెటిరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించిన ఎంపీ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు.
దాతల సహకారంతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.
మంచాల జడ్పీటీసీ మర్రి నిత్య, మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చేయూతనివ్వడానికి తమవంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మంచాల ఎంపీపీ నర్మద, వైస్ ఎంపీపీ రాజేశ్వరి, ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మహిపాల్, మాజీ ఎంపీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొత్తకుర్మ శివకుమార్, మహేందర్‌గౌడ్, వింజమూరి రాంరెడ్డి, ఎడమ నరేందర్‌రెడ్డి, జయానందం, రాందా స్, తహశీల్దార్ దేవుజ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎస్‌ఐ ప్రభాకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.