రంగారెడ్డి

సమస్యల పరిష్కారమే పరమావధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 10: ప్రజా సమస్యలను పరిష్కరించడమే పరమావధిగా పనిచేస్తున్నానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. గాజులరామారం డివిజన్ కైసర్‌నగర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వార్డు సభ్యుడు మసూద్ ఆధ్వర్యంలో చింతల్‌లో ఎమ్మెల్యే వివేక్‌ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, నాయకులు రషీద్, మజర్, రాములు, యాసిన్ పాల్గొన్నారు.
ముస్లిం గ్రేవ్‌యార్డ్ అభివృద్ధికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ తెలిపారు. సుభాష్‌నగర్ డివిజన్ హమీద్‌బస్తీ, సాయిబాబానగర్, నర్సింహబస్తీ, రాజిరెడ్డి నగర్, శివాలయనగర్, రాజీవ్ గాంధీ నగర్‌లలోని ముస్లీం గ్రేవ్‌యార్డ్ అభివృద్ధికి నిధులను మంజూరు చేసిన సందర్భంగా మైనారిటీ నాయకులు చింతల్‌లోని ఎమ్మెల్యే వివేక్‌ను కలిసి సన్మానించి కృతజ్ఞతలను తెలిపారు. యూసుఫ్, ఖాజా, నాజర్, సయ్యద్, వలి, ఖాసీమ్, అఫ్సర్ పాల్గొన్నారు.
నూతన సంక్షేమ సంఘాలు వారధులుగా పనిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. గాజులరామారం డివిజన్ స్రీవెన్ ఎన్‌క్లేవ్ రెసిడెన్షియల్ సొసైటీ నూతన కమిటీ సభ్యులు చింతల్‌లో వివేక్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. కార్పొరేటర్ రావుల శేషగిరి, సంక్షేమ సంఘం సభ్యులు ఎల్లారెడ్డి, సోమరాజు, శ్రీ్ధర్ గౌడ్, జగదీశ్, శివరామకృష్ణ పాల్గొన్నారు.