రంగారెడ్డి

సీసీఐ అధికారులపై రైతుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, డిసెంబర్ 10: అన్నదాతల పట్ల సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలం లాల్‌పహాడ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం కొత్తగా సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అధికారులు, మిల్లు వ్యాపారులు కుమ్మక్కై రైతులను నట్టెట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూకం మిషన్‌లో సెట్టింగ్ చేసి క్వింటాల్ పత్తికి 20 నుంచి 30కిలోల వరకు తక్కువగా తీసుకుంటున్నారని, ఇదేమని తూకమని నిర్వాహకులను ప్రశ్నిస్తే మీ పత్తి ఇంతే ఉందని తిరగబడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోకి వచ్చే వ్యాపారులు గిట్టుబాటు ధర కల్పించడం లేదని సీసీఐ కొనుగోలు కేంద్రానికి వస్తే సగానికి సగం లాక్కుంటున్నారని వాపోతున్నారు. దాంతో సీసీఐ అధికారులపై పత్తిరైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేయాల్సిన అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద సుమారు 30 నుంచి 40 వాహనాలు పత్తి లోడుతో ఉండగా సక్రమంగా తూకం చేసుకొని తీసుకోకుండా అక్రమాలకు ఎందుకు పాల్పడుతున్నారని అధికారులను రైతులు నిలదీశారు. పత్తి నాణ్యత లేదంటూ తీసుకువచ్చిన పత్తిలో సగానికి సగం పత్తిని దోచుకోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంక్ పాస్‌పుస్తకం, ఆధార్ జిరాక్స్ కాపీలు ఇచ్చినప్పటికి ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తి క్వింటాలుకు రూ.5550 ఉండగా స్థానిక అధికారులు మాత్రం రూ.5200 నుంచి రూ.5300 మాత్రమే చెల్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవైపు మధ్య దళారీలే మోసాలు చేస్తుంటే.. మరోవైపు సీసీఐ అధికారులు సైతం రైతులకు మోసాలకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.