రంగారెడ్డి

నేటి బాలలే రేపటి శాస్తవ్రేత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, డిసెంబర్ 10: మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులదే అని విద్యాశఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సెయింట్ మార్క్స్ హైస్కూలులో నిర్వహించిన జిల్లా స్థాయి పాఠశాలల విద్యార్థుల వైజ్ణానిక ప్రదర్శనను మంత్రి సబితా రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మంగళ, బుధవారాలు రెండు రోజుల పాటు కొనసాగే ఈ వైజ్ణానిక ప్రదర్శనలో జిల్లా వ్యాప్తంగా 100 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. నేటి బాలలలే రేపటి సైంటిస్టులు అవుతారని ఉద్ఘాటించారు. నేడు శాస్తస్రాంకేతిక రంగాలలో అత్యున్నత స్థాయిలో ఉందన్నారు. భారత దేశం అన్ని రంగాలతో పాటు శాస్త్ర పరిజ్ఞానిక రంగంలో అగ్ర దేశాల సరసన నిలుస్తోందని మంత్రి వివరించారు. తాండూరు వంటి మారుమూల గ్రామీణ ప్రాంతంలో చిన్నారీ విద్యార్థులు తమ మేధా శక్తిని ప్రదర్శిస్తూ ఈ వైజ్ణానిక సదస్సులో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించటం ఎంతో అభినందనీయం అన్నారు. కలెక్టర్ మస్రత్ ఖానమ్ అయేషా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో తమకున్న ఆసక్తిని కనబర్చడానికి పాఠశాల స్థాయి విద్యార్థులకు జిల్లా స్థాయి పాఠశాలల విద్యార్థులకు తాండూరు కేంద్రంగా వైజ్ణానిక ప్రదర్శనను ఏర్పాటు చేశామని అన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో స్థానిక పాత తాండూరులో ఉన్న మోహీన్ కానె్వంట్ స్కూలు విద్యార్థులు ప్రదర్శించిన భవిష్యత్‌లో తాండూరులో ట్రాఫిక్, పర్యావరణ పరిరక్షణ, రహదారలు మెరుగు, కాలుష్య నియంత్రణపై రూపొందించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ కాలే యాదయ్యలు మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుకా దేవి, సెయింట్ మార్క్స్ హైస్కూలు ప్రిన్సిపాల్ ఫాదర్ ఆనంద్, అన్ని మండలాల విద్యాధికారులు, పుర ప్రముఖులు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బీ.సునీతా సంపత్, మండల జడ్పీటీసీ గౌడి మంజుల పాల్గొన్నారు.