రంగారెడ్డి

మార్కెట్ నిర్మాణానికి మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 10: ఇబ్రహీంపట్నం పాత పోలీసు క్వార్టర్స్ వద్ద రెండు వేల గజాల మార్కెట్ కమిటీ స్థలాన్ని మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోగా మార్గం సుగమమయ్యింది. మంగళవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి జీవో 523ను జారీ చేశారు. స్థానిక కూరగాయల విక్రయం దారులు, చిరువ్యాపారులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రూ.1.06 కోట్ల రూపాయలను మార్కెట్ నిర్మాణానికి మంజూరు చేయించిన విషయం తెలిసిందే. సిద్ధిపేటలో ఉన్న మార్కెట్ మాదిరిగా తీర్చిదిద్దుతామని, గిడ్డంగులను, కూరగాయలను నిల్వ ఉంచుకునేందుకు వీలుగా గదులను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
శామీర్‌పేట, డిసెంబర్ 10: ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఠాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జవహర్‌నగర్ మున్సిపల్ పరిధిలోని చెన్నాపూర్ గ్రామంలో నీటి ట్యాంక్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ఎప్పుడూ ముందుందని చెప్పారు. జవహర్‌నగర్ ప్రాంతం నగరానికి అతి దగ్గరలో ఉన్న ప్రాంతమని ఇక్కడి వారందరు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారేనని వారందరికి కనీస సదుపాయాలు కల్పించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృత నిశ్ఛయంతో ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు, నీరు, మురికి కాలువ నిర్మాణం, విద్యుత్, ఇళ్ల పట్టాల పంపిణీలాంటి కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టామని వివరించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జవహర్‌నగర్ తన నియోజవర్గం పరిధిలో ఉండటం ఎంతో అభినందనీయమని అన్నారు. వారంలవో ఒక రోజైన ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు పార్టీకి విధేయులుగా ఉండి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి పాల్గొన్నారు.