రంగారెడ్డి

చలి మంటల్లో విధుల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 10: దిశ ఎన్‌కౌంటర్ ప్రాంతంలో చలి ‘మంట’ల మధ్య పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన నాటి నుంచి ఆ ప్రదేశంలో భధ్రత కొనసాగిస్తున్నారు. అసలే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులు చిన్నపాటి నెగళ్లు పక్కన ఏర్పాటు చేసి వేడి వాతావరణం సృష్టించుకుంటున్నారు. దిశ సంఘటన జరిగిన నాటి నుంచి మొదలుకుని ఎన్‌కౌంటర్ జరిగిన తరువాత కూడా ఈ ప్రదేశంలో పోలీసులు కట్టుదిట్టమయిన భద్రత నిర్వహిస్తున్నారు. దిశ ఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురైన నాటి నుంచి పోలీసులకు బందోబస్తు తిప్పలు తప్పడం లేదు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ప్రతినిధులు వచ్చారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ బృందం కూడా ఎపుడు వస్తుందోనని పోలీసులు కట్టుదిట్టమయిన ఏర్పాట్లు చేయగా ఉదయం నుంచి మీడియా పడిగాపులు కాస్తోంది. ఉదయం పొగ మంచుతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో బందోబస్తులో ఉన్న పోలీసులు కట్టెలతో పక్కనే మంట పెట్టించి వేడి పుట్టించుకుంటున్నారు. అసలే చలి కాలంలో ఇలా బహిరంగ ప్రదేశాలలో చలి ఎలా ఉంటుందో చూస్తున్నామని అంటున్నారు. వీరితో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఆ ప్రదేశానికి ఎవరు.. ఎపుడు వస్తారో తెలియని పరిస్థితుల మధ్య అక్కడే పడిగాపులు పడుతున్నారు.

దిశ ఘటన నేపథ్యంలో..
సర్కారు బడుల్లో కరాటే శిక్షణ ప్రారంభం
కొత్తూరు రూరల్, డిసెంబర్ 10: జస్టిస్ ఫర్ దిశ సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కరాటే శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోధివర్మకుప్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థినులకు కరాటే శిక్షణను ప్రారంభించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భాగ్యమ్మ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చినట్లు వివరించారు. బాలికలపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే వారి నుంచి తప్పించుకునేందుకే ఆత్మరక్షణకు విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఏడవ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, కరాటే మాస్టర్ నర్సింలు పాల్గొన్నారు.

గ్రహణ మొర్రి బాధితులకు శస్త్ర చికిత్స
కేపీహెచ్‌బీకాలనీ, డిసెంబర్ 10: గ్రహణ మొర్రితో బాధపడే పేద పిల్లలకు రామ్‌దేవ్‌రావు ఆసుపత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావు, అఖిల భారత మహిళా సేవా సమాఖ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రహణ మొర్రితో భాధపడే 12 మంది పిల్లలకు శస్త్ర చికిత్స చేశారు. డాక్టర్లు తోట దయాకర్, డాక్టర్ ఎన్.యోబు మాట్లాడుతూ గ్రహణ మొర్రితో బాధపడే పేద పిల్లలకు ఉచితంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ శస్త్ర చికిత్స 11వ సారి చేపట్టామని తెలిపారు. అవసరమైన వారు ఈ చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ల బృందం చరణ్‌రెడ్డి, డాక్టర్ శివనాగేందర్ రెడ్డి, డాక్టర్ విజయ్‌కాంత్ పాల్గొన్నారు.