రంగారెడ్డి

గజ గజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 10: చలి పంజా విసురుతుండటంతో ప్రజలు వణుకుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం రాత్రి పూట.. ఉదయం బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు.
చలికితోడు ఉదయం సమయంలో మంచు వస్తుండటంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పగలు, రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పడిపోవడంతో జనం చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు.
సాయంత్రం నాలుగు గంటలు దాటిందంటే చాలు చలిగాలులు వీస్తున్నాయని, దీంతో ప్రజలు వివిధ పనులు ముగించుకొని త్వరగా ఇళ్లకు చేరుకుంటున్నారు. ఉదయం ఎనిమిది గంటల దాటిన చలితీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు స్వెటర్లు ధరించి ఇళ్లల్లో ఉండిపోతున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, ఫరూఖ్‌నగర్, నందిగామ, చౌదరిగూడ మండలాల్లో వారం రోజుల నుంచి చల్లని గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో చల్లని గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు జ్వరం, జలుబు త్వరగా వ్యాపిస్తుండటంతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. వాతావరణం చల్లబడిపోవడంతో వైరల్ ఫివర్ త్వరగా వ్యాపించి ప్రజలు మంచనా పడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులు పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు త్వరగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని స్థానిక వైద్యులు పేర్కొంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు ఉదయం, సాయంత్రం సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులు త్వరగా వ్యాపించే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. దగ్గిన, తుమ్మినా నోటికి అడ్డంగా బట్టలు పెట్టుకోవాలని, అప్పుడు ఒకరి నుండి మరొకరికి బ్యాక్టిరియా వ్యాపించే అవకాశాలు ఉండవని తెలిపారు. ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు.