రంగారెడ్డి

అభయాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 12: చిల్కానగర్‌లోని శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో 21వ అడుగుల శ్రీఅభయాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు కోసం గురువారం భూమిపూజ జరిగింది. గుడి మధుసూదన్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పీఠాధిపతులు డాక్టర్ శ్రీకాంత్ రేంద్ర చేతుల మీదుగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ గుడి మధుసూదన్ రెడ్డి, పట్టణ పెద్దలు గుడి నరోత్తం రెడ్డి, డాక్టర్ రామ చంద్రా రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, నవీన్ రెడ్డి, అశోక్‌వర్ధన్ రావు, బండారు కృష్ణ, ప్రవీణ్, వడ్లూరి రాజయ్య, నీలకంఠం, బ్రహ్మచారి, నరసింహ చారి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.