రంగారెడ్డి

కొనసాగుతున్న ఫుట్‌పాత్ కబ్జాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 14: జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్‌లో ఫుట్‌పాత్ కబ్జాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. పోలీసు బందోబస్తు మధ్య శనివారం రెండవ రోజు రింగ్‌రోడ్డులో డబ్బాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్ పర్యవేక్షణలో ఏఎంహెచ్‌ఓ ఉమా గౌరీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య విభాగం సిబ్బంది కబ్జాలను తొలగించడంతో ఫుట్‌పాత్ నిరుపేద వ్యాపారులు వీధిన పడ్డారు. ఎంతో ఖర్చుతో చేయించుకున్న డబ్బాలు, విలువైన వస్తువులను సైతం వదలకుండా తొలగించడంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపించకుండా తొలగిస్తే బతుకుదెరువు ఎలా అని ధ్వజమెత్తారు. ఒక దశలో వ్యాపారులు అధికారుల తీరుపై ఆందోళనకు దిగి దాడి చేసేంత పని చేశారు. న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఫుట్‌పాత్ వ్యాపారుల సంఘం ప్రతినిధులు హెచ్చరించారు.
ఎస్సీ వసతిగృహాల్లో ఉన్ని దుస్తుల పంపణీ
మేడ్చల్, డిసెంబర్ 14: మేడ్చల్ పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ వసతిగృహాల్లో శనివారం సాయంత్రం ఉన్ని దుస్తులు (స్వెట్టర్‌లు) పంపిణీ చేశారు. పట్టణంలోని ఎస్సీ బాలికల, బాలల హస్టల్స్‌లో జడ్పీటీసీ శైలజ రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి విద్యార్థులకు శీతకాలంలో చలి నుండి కాపాడుకునేందుకు స్వెట్టర్‌ను అందజేశారు.
పోలీసులకు ఆరోగ్య పరీక్షలు తప్పని సరి
కీసర, డిసెంబర్ 14: పోలీసులు ఆరోగ్య పరీక్షలు తప్పని సరిగా చేయించు కోవాలని కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ పేర్కొన్నారు. శనివారం కీసరలోని పగిడిశీల ఫంక్షన్ హాల్‌లో కీసర పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఏసీపీ ప్రారంభించారు. నిత్యం పని వత్తిడితో పని చేస్తున్న పోలీసులు ప్రధానంగా ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని, వత్తిడిని అధిగమించటానికి యోగా చేయాలని అన్నారు. ఏసీపీ శివకుమార్‌తో పాటు కీసర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారి కుటుంబ సభ్యులు వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. కార్డియో, డెంటల్, ఆప్తమాలజీ, ఆర్ధో, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు సాధారణ పరీక్షలను నగరంలోని కేర్, ఫోర్ట్ డెంటల్ ఆసుపత్రుల వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులకు ఉచితంగా మందులను పంపిణీ చేసారు. కార్యక్రమంలో సీఐ నరేందర్ గౌడ్, ఎస్సైలు శోభన్‌బాబు, శ్రీనివాస్, రామసూర్యం, జగన్ రెడ్డి పాల్గొన్నారు.