రంగారెడ్డి

అంగన్‌వాడీ కేంద్రాలకు నిలిచిన గుడ్డు సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 15: చిన్నారులకు పౌష్టికాహారం..బాలింతలకు పోషకాహారం అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి గుడ్డును సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును నిలిపివేయడంతో ఈనెల మొదటి వారం నుండి గుడ్డు సరఫరాను నిలిపివేశారు. షాద్‌నగర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గుడ్ల సరఫరా నిలిచిపోవడంతో సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలోను ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నా స్థానికంగా మాత్రం కొన్ని చోట్ల 15రోజుల నుండి, మరికొన్ని చోట్ల 20రోజులుగా గుడ్డు సరఫరా ఆగిపోయిందని చెబుతున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫరూక్‌నగర్, కేశంపేట, కొత్తూరు, నందిగామ, కొందుర్గు, జిల్లెడ్ చౌదరిగూడ మండలలాలతో పాటు పురపాలిక పరిధిలో గుడ్డు సరఫరా ఆగిపోవడంతో ప్రభుత్వ లక్ష్యం ఆచరణలో దెబ్బతింటోంది. గుడ్డు ధర కూడ విపరీతంగా పెరిగిపోవడం కూడా..కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగడానికి ఒక కారణమై ఉండి ఉండవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంగన్ కేంద్రం పరిధిలో అనుబంధ పోషకాహారం క్రింద నెలకు 16చొప్పున గుడ్లను అందచేస్తారు. షాద్‌నగర్ సమగ్ర, శిశు పథకాధికారిణి కార్యాలయం ఆధ్వర్యంలో 316కేంద్రాలలో ఆరోగ్యలక్ష్మీ పథకంలో గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజు గుడ్లను అందచేస్తారు. కొందుర్గు మండల పరిధిలో మొత్తం 37 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా అందులో 32 కేంద్రాలు ప్రధానంగా, 5 కేంద్రాలు మినీ కేంద్రాలుగా పని చేస్తున్నాయి. చౌదరిగూడ మండలంలో 38అంగన్‌వాడీ కేంద్రాలకు గాను 5మినీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఫరూఖ్‌నగర్ మండలంలో 84అంగన్‌వాడీ కేంద్రాలు, 33మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. నందిగామ మండలంలో 32అంగన్‌వాడి కేంద్రాలు ఉండగా ఒక మినీ అంగన్‌వాడీ కేంద్రం, కొత్తూరు మండలంలో 27అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా నాలుగు మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. కేశంపేట మండలంలో 48అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ఆరు మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. షాద్‌నగర్ డివిజన్‌లో 262 అంగన్‌వాడీ కేంద్రాలు, 54 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు మొత్తం 316 కేంద్రాలు ఉన్నట్లు అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ఎక్కడికక్కడ అంగన్‌వాడీ కేంద్రాలలో పోషకాహారం అందుతుందనే ఉద్దేశంతో అందచేస్తారు. ఈకార్యక్రమంలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయనే చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులలో అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా నిలిపివేయడం సమంజసంగా లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి అంగన్ వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.