రంగారెడ్డి

ఆధునిక వైద్యం పేదలకు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, డిసెంబర్ 15: కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం ఎల్బీనగర్ చౌరస్తాలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడిక్విస్ట్ డయాగ్నొస్టిక్స్ సెంటర్‌ను మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్టాడుతూ శివారు ప్రాంతాల ప్రజలకు మెడిక్విస్ట్ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని, పేద ప్రజల ఆర్థిక వసతులను చూసి బిల్లులను నిర్ణయించాలని సూచించారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. తమ డయాగ్నస్టిక్స్ సెంటర్‌లో అన్ని రకాల పరీక్షలకు సంబంధిన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఎండీ పీఎస్.్ఫణిశర్మ చెప్పారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కే.నవీన్ కుమార్, స్థానిక కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, ఎల్బీనగర్ బ్రాంచి మేనేజర్ జావేద్, స్థానిక నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ తెరాస అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, ప్రధాన కార్యదర్శి సిద్దగోని జగదీష్ గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.