రంగారెడ్డి

ఫాస్టాగ్ షూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 15: ఫాస్టాగ్..జాతీయ రహదారుల టోల్‌ప్లాజాల వద్ద అమలు తప్పని సరి అయ్యింది...షాద్‌నగర్ సమీపంలోని జాతీయ రహదారి 44టోల్‌గేట్ల వద్ద ఆదివారం నుండి ఫాస్టాగ్ అమలును కఠినతరం చేయడానికి శ్రీకారం చుట్టారు. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై రుసుమును వసూలు చేయడానికి ఫాస్టాగ్ విధానాన్ని కొంతకాలం కిందట మొదలుపెట్టారు. ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని తప్పసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇందులో భాగంగా టోల్‌గేట్ల వద్ద చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం నుంచి పాస్టాగ్ విధానం అమలుని కఠినతరం చేసింది. ఇందులో భాగంగా షాద్‌నగర్ సమీపంలోని జాతీయ రహదారి44 గల టోల్‌ప్లాజాలో రుసుము వసూలు చేసే లైన్ల(కౌంటర్లు)లో అన్నింటినీ పాస్టాగ్ విధానం అమలు చేస్తూ కేవలం ఒక్క కౌంటర్‌లో మాత్రమే డబ్బులు తీసుకుంటున్నారు. ఆదివారం నుంచి ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేయడంతో వాహనాలు బారులు తీరాయి. కొందరు వాహనదారులకు ఫాస్టాగ్ విధానాల గురించి తెలియకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు ఫాస్టాగ్ విధానంపై అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఫాస్టాగ్ అప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా వినియోగించాలనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇది కాకుండా ఇక్కడ ఇంతకుముందు టోల్‌ప్లాజా భవనంలో రెండు నెలల ముందే ఫాస్టాగ్ కేంద్రాన్ని ప్రారంభించగా ఇపుడు టోల్‌గేటు పక్కనే ఫాస్టాగ్ కేంద్రాలను ప్రారంభించారు. ఫాస్టాగ్ అమలులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఫాస్టాగ్ అమలుకు శ్రీకారం చుట్టినా..వాహనదారుల్లో అవగాహన కల్పించడంలో టోల్ నిర్వాహకులు విఫలమవుతున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. దీని వల్ల టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీ ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసలే వేలాది వాహనాలు తిరుగాడుతుంటే ఈటోల్‌గేటు గుండా వాహనదారులకు సరైన అవగాహన కల్పించేందుకు టోల్ నిర్వాహకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. టోల్ గేటు వచ్చి పోయే లైన్లలో ఒక్కదానిని మినహాయించి..అన్ని లైన్లను ఫాస్టాగ్‌గా మార్చారు.