రంగారెడ్డి

అవినీతిపై ఫిర్యాదు చేసినందుకు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, సెప్టెంబర్ 20: ప్రజా సమస్యలపై, నేతల అవినీతిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడి చేసిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన ఆలూర్ ఉపసర్పంచ్ షబ్బీర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు హైమాద్ డిమాండ్ చేశాడు. మంగళవారం చేవెళ్లలో ఆయన విలేఖరుతో మాట్లాడుతూ ఆలూర్ గ్రామంలో మంచిగా ఉన్న మురుగు కాలువలను తవ్వి అండర్‌డ్రైనేజీ పనులు చేయడంతో ప్రజాధనం వృథా చేస్తున్నారని, ఈ అవినీతిని అరికట్టాలని ఆలూర్ గ్రామస్తులతో కలిసి సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఫిర్యాదు చేసిన తనపై ఆ గ్రామానికి చేందిన ఉపసర్పంచ్ షబ్బీర్, అతని అనుచరులు సోమవారం రాత్రి దాడికి పాల్పడినట్లు హైమాద్ తెలిపారు. ఎన్నో సంవత్సరాల క్రితం రాతితో నిర్మించిన మురుగు కాల్వలను కూలదోసి వాటి స్థానంలో అండర్ డ్రైనేజీ పనులు చేపట్టేందుకు కాలువలు తవ్వుతున్నారని చెప్పారు. వార్డు మెంబర్ల తీర్మానం లేకుండా పనులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా గ్రామంలో చాలాచోట్ల మురుగుకాలువల అవసరం ఉంది. అక్కడ నిర్మించకుండా ఇక్కడ నిర్మించడంతో ప్రజాధనం వృథా అవుతోందని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేక ఉపసర్పంచ్ దాడికి పాల్పడ్డాడని అతనిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

చేవెళ్ల జిల్లా కోసం ప్రాణత్యాగానికి సిద్ధం
చేవెళ్ల, సెప్టెంబర్ 20: చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గలను కలుపుకొని జిల్లా చేయాలని జిల్లా పోరాట సమితి నాయకులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. చేవెళ్ల జిల్లా కోసం చేపట్టిన దీక్ష మంగళవారానికి 15వ రోజుకు చేరగా, చేవెళ్ల బంద్ ఐదో రోజుకు చేరింది. అఖిల పక్షనాయకులు మాట్లాడుతూ చేవెళ్ల జిల్లా కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చేవెళ్ల ఉద్యమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే, యువ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కదలి రవాలన్నారు. లేకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్లకు అన్యాయం చేస్తున్న నాయకులకు పుట్టగతులు ఉండవని అరోపించారు.
చేవెళ్ల పార్లమెంటరీ కేంద్రాన్ని జిల్లా చేయాలని ఇబ్రహింపల్లి గ్రామ సర్పంచ్ జంగారెడ్డి, చేవెళ్ల కోఆప్షన్ మెంబర్ జంగీర్, చేవెళ్ల, అలూర్, మల్కాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు మంగలి నర్సిములు, శివరాజు, విఠల్ యాదవ్ మంగళవారం చేవెళ్లలో ఆమరణ నిరాహాదీక్షలో కూర్చున్నారు. చేవెళ్లను జిల్లాగా ప్రకటించేంత వరకు ఈ దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు గ్రామాల నుంచి ప్రజలు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, ఆటోయూనియన్, చేవెళ్ల అంబేద్కర్ సంఘం సభ్యులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
సర్పంచ్‌ల రాజీనామాలు
చేవెళ్ల జిల్లా సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయ గ్రామాల సర్పంచ్‌లు అన్నారు. చేవెళ్ల జిల్లా కోసం కొనసాగుతున్న దీక్షలో బాగంగా ఊరేళ్ల సర్పంచ్ స్వరూప రమేష్, తంగడిపల్లి సర్పంచ్ కిష్టయ్య, అల్లవాడ సర్పంచ్ అత్తెల్లి అనురాధ అమర్‌లు వారి పదవులకు రాజీనామాలు చేశారు. చేవెళ్ల పార్లమెంటరీ కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించేంత వరకు ఈ ఉద్యమం అపేదిలేదని అన్నారు.
కొంతమంది నాయకులు చేవెళ్లను శంషాబాద్‌లో కలపాలని తీర్మానిస్తున్నారని, అలా చేస్తే ఉద్యమం నీరు గారుతుందని, అందరం ఎకతాటిపై ఉండి చేవెళ్లను జిల్లాగా సాధించుకునే వరకు పోరాటం చేయాలని సూచించారు.

తాండూరులో అఖిలపక్షం బంద్ విజయవంతం
తాండూరు, సెప్టెంబర్ 20: తాండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ, తాండూరు అఖిలపక్షం నేతలు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా కలిసి ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మంగళవారం తాండూరులో సంపూర్ణంగా బంద్ ప్రశాంతంగా విజయవంతం అయ్యింది. తాండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడంతో పాటు 19 మండలాలతో జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో, తాండూరు బంద్‌కు అఖిలపక్షం పిలుపు నిచ్చింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే, ఆందోళనకారులు ర్యాలీగా బయలుదేరి పట్టణంలో ఊరేగింపులు,మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ బంద్‌ను పాటించారు. పట్టణంతో పాటు, డివిజన్‌లోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దెముల్ మండల కేంద్రాలలో సైతం బంద్‌లు పాటించారు. తాండూరు పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బ్యాంకులు దినమంతా మూతపడ్డాయి. తాండూరు ఆర్టీసి డిపో నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు బయటకు రాలేదు. దాంతో తాండూరు ఆర్టీసీ డిపోకు రూ.10లక్షలకు పైగా ఆదాయానికి గండి పడిందని ఆధికారులు, డిపో మేనేజర్ కె.శ్రీనివాస మూర్తి పేర్కొన్నారు. కాగా, పట్టణంలో బంద్ సందర్బంగా ర్యాలీలు, ఆందోళనలు అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరాస్తాలో నిర్వహించిన అఖిలపక్షం సభలో తాండూరుకు చెందిన అన్ని పార్టీల నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. తాండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు, 19 మండలాలతో కూడిన జిల్లా రూపకల్పన జరిగే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదంటూ పేర్కొన్నారు.

అమర జవానులకు నివాళి
కులకచర్ల, సెప్టెంబర్ 20: కశ్మీర్‌లో పాకిస్తాన్ ముష్కరులు మన సైనిక పటాలంపై దాడి చేసి 18మందిని హతమార్చిన ఘటన విషయంలో నిరసనలు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికల్‌లో విద్యార్థులంతా కలిసి పాకిస్తాన్ జెండాను తగులబెట్టారు. జెండాను కాదు పాకిస్థాన్‌ను తగులబెట్టాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న పాలకులు.. పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునేందుకు చొరవ చూపేవారు కాదని కాని నేడు ప్రపంచ దేశాలు మన దేశాన్ని చూసి హడలెత్తిపోతుంటే పక్కలోని పాకిస్తాన్‌ను ఎందుకు సమర్థవంతంగా ఎదుర్కోలేక పోతున్నారని వారని అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో గిరిజన నాయకుడు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తులతో వీరమరణం పొందిన జవానులకు నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన వారికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలమని పేర్కొన్నారు.
కీసరలో..
కీసర: కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరజవాన్లకు కీసరలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. రాజకీయ జెఏసి, యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి తొవ్వొత్తులు చేతబూని కీసరలోని వీధుల వెంట భారత్‌మాతాకీజై అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద వీర జవాన్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు ఎన్.వెంకట్‌రెడ్డి, ఎం.రాఘవేందర్‌గౌడ్, ఎం.మహేందర్ యాదవ్, రాజు, శంకర్, అనిల్, పరమేశ్, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీశైలం, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
దేవరయాంజాల్‌లో..
శామీర్‌పేట: దేశ రక్షణలో భాగంగా తమ ప్రాణాలను వదిలిన భారత జవాన్లకు ఆత్మ శాంతి కలగాలని ప్రార్థిస్తూ మండలంలోని దేవరయాంజాల్, శామీర్‌పేట గ్రామాల్లో కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఎంపిటిసి జైపాల్ ఆధ్వర్యంలో దేవరయాంజాల్ గ్రామంలో సోమవారం రాత్రి, శామీర్‌పేట ప్రభుత్వ పాఠశాల్లో మంగళవారం ఉదయం విద్యార్థుల చేత కొవ్వత్తులను వెలిగించి అమర వీరుల జవాన్లు అమర్ హై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు మహిపాల్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు పాల్గొన్నారు.
ఖబర్దార్ పాకిస్తాన్
ఉప్పల్: ఉగ్రవాదుల దాడులను తిప్పికొడుతామని యువత హెచ్చరించింది. కాశ్మీర్‌లో సైనికులపై జరిపిన దాడికి నిరసనగా ఉప్పల్ పట్టణంలో ప్రజలు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి రింగ్‌రోడ్డు వరకు నిర్వహించిన ర్యాలీలో యువజన సంఘాలు, విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాల యువకులు వందలాది మంది పాల్గొని వీర మరణం పొందిన సైనికుల చిత్ర పటాలకు జోహార్లు అర్పించారు. ఖబర్ధార్ పాకిస్తాన్ అంటూ ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సైనికులపై జరిగిన దాడిని నిరసిస్తూ బిజెపి చిల్కానగర్ డివిజన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉప్పల్ రింగ్‌రోడ్డులో పాకిస్తాన్ జెండాలను దగ్ధం చేశారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల కదలికలపై అప్రమత్తంగా ఉండి దాడులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిజెడి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.విజయలక్ష్మి, నాయకురాలు పద్మ, డివిజన్ అధ్యక్షుడు డి.బాల్‌చందర్, నాయకులు బొంగు రమేశ్, మంకాల లక్ష్మణ్, రేవెల్లి రాజు, శ్రీకాంత్, దేవేందర్‌రెడ్డి, సుమన్‌శర్మ, శ్రీ్థర్ గుప్త, హరిప్రసాద్, జంగయ్య, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.
ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టాలి : బిజెపి
కాచిగూడ: ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టాలని బిజెపి సీనియర్ నాయకుడు శేఖర్ మహడిక్ అన్నారు. ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ శేఖర్ ఆధ్వర్యంలో పాకిస్థాన్ దిష్టిబొమ్మను మంగళవారం శివం చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంపైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎం.ఉదయ్‌కుమార్, వీరేశం, శివకుమార్, పరుశురామ్, మహేందర్, మహేష్, సన్ని, ఇఫాన్, రహీజ్, సమీమ్, జావిద్, వినిత్ అగర్వాల్, సమీమ్, వెంకటేష్ పాల్గొన్నారు. ‚ జగద్గిరిగుట్టలో..
జీడిమెట్ల: దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికులకు జగద్గిరిగుట్టలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. యుద్ధంలో అసువులు బాసిన సైనికులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. సిపిఐ నాయకుడు ఏసురత్నం మాట్లాడుతూ దేశం కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన సైనికుల సేవలను ఎన్నటికీ మరువరాదని సూచించారు. దేశానికి అలాంటి సైనికుల సేవలు ఎల్లప్పుడు అవసరమని చెప్పారు.
కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, ఎంఎస్ రెడ్డి, వెంకటేశ్, యాకయ్య, సుధాకర్, సోమన్న, మహేశ్, సత్యానందం పాల్గొన్నారు.

ఆంధ్రాబ్యాంక్, ఇన్‌కమ్‌టాక్స్, ఎస్‌సిఆర్ జట్ల గెలుపు
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 20: తెలంగాణ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని లాల్‌బహదూర్ కబడ్డీ స్టేడియంలో ప్రారంభమైన వార్షిక ఇంటర్ డిపార్ట్‌మెంట్ స్టేట్ ‘ఎ’ లీగ్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఎస్‌సిఆర్, ఆంధ్రాబ్యాంకు, ఇన్‌కమ్‌టాక్స్ జట్లు గెలుపొందాయి. చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఒలింపిక్ సంఘం జాయింట్ సెక్రటరీ, తెలంగాణ సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు పి.మల్లారెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రాచీన క్రీడల్లో కబడ్డీ క్రీడ ఒకటన్నారు. రోజురోజుకు కబడ్డీ క్రీడకు ప్రపంచంలోని అన్నిదేశాల్లో ఎంతో ప్రాచుర్యం లభిస్తుందన్నారు.