రంగారెడ్డి

కుక్కకాటుకు మందులు లేవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జనవరి 19: గర్భిణుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రజిని వైద్యులను హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని కమ్యూనిటీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సక్రమంగా వ్యవహరించాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పనిసరని సూచించారు. ఆసుపత్రి పనితీరుపై సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఎమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలి, కానీ రోగులను ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నప్పటికీ వైద్యులు నిర్లక్ష్యం వహించడం ఏమిటని అన్నారు. ప్రసవాల కోసం ఆసుపత్రికి వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించడం సరైన పద్ధతి కాదని సూచించారు. ప్రసవాల కోసం గర్భిణులు వస్తే మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన మహిళలకు తక్షణమే కేసీఆర్ కిట్ ఇవ్వాలని సూచించారు. కుక్కకాటుకు మందులు ఎల్లప్పుడు అందుబాటులో పెంటాలని, ఆసుపత్రిలో మందులు లేకపోవడం ఏమిటని డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో మందులు తెప్పించుకోవాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయాలు తమ దృష్టికి వచ్చాయని వివరించారు. మరోమారు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లను హెచ్చరించారు.ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను బయటకు పంపించకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలని, అందుకు కావాల్సిన వసతులను సమకూర్చుకోవాలని అన్నారు. వార్డుల్లో పర్యటించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు చుక్కలు వేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందు నాయక్, హెల్త్ ఎడ్యుకేటర్ డాక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.