రంగారెడ్డి

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జనవరి 20: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఈనెల 22న జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ అందజేయాలని, పోలింగ్ ఏర్పాట్లపై అవగాహన కల్పించి, ఒక రోజు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. సిబ్బందికి తాగునీరు, భోజన వసతి, టాయ్‌లెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. డీఆర్సీ సెంటర్లలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. మద్యం, డబ్బు పంపిణీ ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృద్ధులకు, దివ్యాంగులకు గర్భిణులకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికల సిబ్బందిని కేటాయించామని వివరించారు. 289 వార్డులకు, 832 పోలింగ్ కేంద్రాలకు 47 మంది మైక్రో అబ్జర్వర్లు, 932 పీవోలు, 932 ఏపీవోలు, 2797 ఓపీవోలను కేటాయించామ కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ విద్యాసాగర్, డీఆర్వో మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.