రంగారెడ్డి

పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల లేమిపై కలెక్టర్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జనవరి 21: పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించలేదని మున్సిపల్ అధికారులపై మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి కలెక్టర్ ఎంవీరెడ్డి.. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల విధులకు వచ్చిన మహిళా సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సిబ్బందికి సౌకర్యాలు కల్పించడంతోపాటు పోలింగ్ సందర్భంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆదేశించారు. మేడ్చల్ తహశీల్దార్ సురేందర్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారు.